చదునైన ఆకారంతో, చూడటానికి భారీ నల్లటి ఆల్చిప్పలా కనిపించే ఓ అరుదైన చేప ఒడిశా కటక్జిల్లా నియాలి గ్రామంలో మత్య్సకారుల వలకి చిక్కింది. గ్రామంలోని కుందిముహా వంతెన సమీపంలో కొందరు జాలర్లు చేపల కోసం ఏర్పాటు చేసిన వలలో ఈ భారీ చేప చిక్కుకుంది.
బయటకి తీసిన జాలర్లు దానిని స్టిన్గ్రే (శాస్త్రీయ నామం)గా గుర్తించారు. దీనిని స్థానికంగా సంకుచగా పిలుస్తారు. సుమారు 300 కిలోల వరకు బరువు ఉంటుందని తెలిపారు.
భారీ కాయంతో ఉన్న ఈ చేపను చూసేందుకు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చేప వద్ద సెల్ఫీలు దిగుతూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.
ఇదీ చూడండి : '5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ' చెరిగిన స్వప్నమే!