ETV Bharat / bharat

వ్యాపారి ఇంట్లో 'పేలని బాంబు'- అనేక గంటలు టెన్షన్

ఝార్ఖండ్ బొకారోలో ఓ ఫర్నిచర్ వ్యాపారి ఇంట్లోకి గుర్తు తెలియని వ్యక్తులు జిలెటిన్ బాంబు విసరడం స్థానికంగా కలకలం సృష్టించింది. విషయం తెలుసుకున్న రాంచీ బాంబు స్క్వాడ్​.. ఆ బాంబును విజయవంతంగా నిర్వీర్యం చేసింది. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Gelatin bomb found in residential area in Bokaro, safely diffused
బొకారోలో బాంబు కలకలం.. వ్యాపారే టార్కెట్​!
author img

By

Published : Jun 20, 2020, 4:38 PM IST

గుర్తు తెలియని వ్యక్తులు ఓ వ్యాపారి ఇంట్లోకి విసిరిన జిలెటిన్​ స్టిక్స్​ను... బాంబ్​ స్క్వాడ్​ విజయవంతంగా నిర్వీర్యం చేసిన ఘటన ఝార్ఖండ్ బొకారా సెక్టార్​ 12లో జరిగింది. వినయ్ కుమార్​ డే అనే ఫర్నిచర్ వ్యాపారి ఇంట్లోకి... కొందరు దుండగులు బాంబు విసిరేసి వెళ్లిపోయారు.

"బయట ఏదో శబ్దం వినిపించి బయటకు వచ్చాను. బహుశా మామిడి పండు పడి ఉంటుందని అనుకున్నాను. అయితే ఎదురుగా ఓ బొమ్మ కనిపించింది. ఇది చూడడానికి కాస్త అనుమానాస్పదంగా కనిపించింది. ఇది చూసిన మా నాన్న ఇదేదో ప్రమాదకరమైన వస్తువులా ఉందని అన్నారు. దీనితో దానిని ఇంటి బయట పడేశాను. తరువాత పోలీసులకు ఫిర్యాదు చేశాను."

- వినయ్ కుమార్, ఫర్నిచర్ వ్యాపారి

వినయ్​ కుమార్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సీఐఎస్​ఎఫ్ స్క్వాడ్​... ఆ బొమ్మలో పేలుడు పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే రాంచీ బాంబు స్క్వాడ్​కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న స్క్వాడ్​... మరుసటి రోజు ఉదయం ఆ బాంబును విజయవంతంగా నిర్వీర్యం చేసింది.

"మాకు ఎవరితోనూ ఎలాంటి శత్రుత్వం లేదు. మా ఇంట్లోకి ఎవరు, ఎందుకు బాంబు విసిరారో తెలియదు. మొత్తానికి మేము ప్రమాదంలో ఉన్నామని తెలుస్తోంది."

- వినయ్​కుమార్, ఫర్నిచర్ వ్యాపారి

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు.

ఇదీ చూడండి: 'గ్రామాభివృద్ధికి దారి చూపిన లాక్​డౌన్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.