ETV Bharat / bharat

సుష్మ మృతితో శోకసంద్రంలో దివ్యాంగురాలు..ఎవరామె?

సుష్మాస్వరాజ్​ రూపంలో తన తల్లిని కోల్పోయానని విలపించింది ఓ దివ్యాంగురాలు. ఎనిమిదేళ్ల వయసున్నప్పుడు పాకిస్థాన్​లో తప్పిపోయిన తనను స్వదేశానికి రప్పించడంలో సుష్మ కీలకంగా వ్యవహరించారని గుర్తు చేసుకున్నారు.

సుష్మ రూపంలో నా తల్లిని కోల్పోయా
author img

By

Published : Aug 7, 2019, 6:34 PM IST

Updated : Aug 7, 2019, 9:59 PM IST

సుష్మా స్వరాజ్​ మరణవార్త విని దేశ వ్యాప్తంగా ఆమె అభిమానులు శోక సంద్రంలో మునిగారు. తమ ప్రియనేత ఇక లేరన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోయారు. దేశ విదేశాల్లోని సుష్మ ప్రియులు ఆమెను స్మరించుకున్నారు. అయితే గీత అనే దివ్వాంగురాలు(మూగ-చెవిటి) తన తల్లి లాంటి సుష్మను కోల్పోయానని విలపిస్తోంది. పాకిస్థాన్​లో తప్పిపోయిన తనను స్వదేశానికి రప్పించడంలో సుష్మ ఎంతో కృషి చేశారని గుర్తుచేసుకుంది. తన సంరక్షకురాలిని కోల్పోయానని సంజ్ఞలతో చెప్పుకొచ్చింది గీత.

సుష్మ రూపంలో నా తల్లిని కోల్పోయా

ఎనిమిదేళ్ల వయసులో...

గీతకు ఎనిమిదేళ్ల వయసున్నప్పుడు పాకిస్థాన్​లో తప్పిపోయింది. లాహోర్​ నగరంలో సంఝౌతా ఎక్స్​ప్రెస్​లో ఒంటరిగా కనిపించిన గీతను అక్కడి ఈదీ ఫౌండేషన్​ వారు చేరదీశారు. అనంతరం 2015లో గీత భారత్​కు తిరిగివచ్చింది. అప్పటి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్​.. దివ్యాంగురాలైన గీతను స్వదేశానికి రప్పించడంలో కీలకపాత్ర పోషించారు. భారత పుత్రికగా గీతను పేర్కొన్నారు సుష్మ. ఈ దివ్యాంగురాలి.. తల్లి దండ్రులెవరో తెలియకపోయినా గీతను ప్రభుత్వం సంరక్షిస్తుందని భరోసానిచ్చారు.

ప్రస్తుతం మధ్యప్రదేశ్​లోని మూగ,చెవిటి ఇన్​స్టిట్యూట్​లో వసతి పొందుతూ అక్కడే చదువుకుంటున్న గీత కుటుంబ సభ్యులు ఎవరో ఇప్పటికీ తెలియలేదు.

ఎప్పటికప్పుడు పరామర్శ

కేంద్ర మంత్రిగా తీరిక లేకుండా ఉన్నప్పటికీ.. గీత చదువు, ఆరోగ్యంపై సుష్మ ఎప్పటికప్పుడు ఆరా తీసేవారని ఇన్​స్టిట్యూట్​ అధికారులు చెబుతున్నారు.

Intro:Body:Conclusion:
Last Updated : Aug 7, 2019, 9:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.