ETV Bharat / bharat

'48 గంటల్లోనే కరోనా పరీక్ష ఫలితం' - corona latest news in telugu

కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచి, 48 గంటల్లోగా టెస్టింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని ఆసుపత్రులకు ఆదేశాలు జారీ చేసింది దిల్లీ ప్రభుత్వం.

Gear up for more COVID-19 testing, process samples within 48 hrs: Delhi govt to labs, hospitals
'48 గంటల్లోగా కరోనా పరీక్షలు పూర్తి చేయాలి'
author img

By

Published : Jun 15, 2020, 6:16 PM IST

దిల్లీలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరుగుతున్న వేళ.. టెస్టుల వేగాన్ని పెంచాలని ఆసుపత్రులు, ల్యాబ్​లను ఆదేశించింది దిల్లీ ప్రభుత్వం. కొవిడ్​ పరీక్షల సామర్థ్యాన్ని పెంచి, 48 గంటల్లోగా ప్రక్రియ పూర్తి చేయాలని సూచించింది.

"దిల్లీలో కరోనా కేసులు పేరుకుపోతున్న వేళ... కొవిడ్​-19 టెస్టింగ్​ సామర్థ్యాన్ని పెంచాలని నిర్ణయించాం. ప్రైవేట్ ల్యాబ్‌లకు నమూనాలను పంపడానికి ఇక్కడ ఎటువంటి పరిమితులు విధించలేదు. అవి నిర్ణీత కాలపరిమితిలో పరీక్షలు చేపట్టాలి. అంటే గరిష్ఠంగా 24 గంటల నుంచి 48 గంటల్లో పరీక్ష ప్రక్రియను పూర్తి చేయాలి. నమూనాలను ఐసీఎమ్​ఆర్ నిబంధనలకు కట్టుబడి సేకరించాలి. ఆర్టీ పీసీఆర్ అప్లికేషన్ ఉపయోగించకుండా ఎటువంటి నమూనాను తీసుకోకూడదు"

-పద్మిణి సింగ్లా, దిల్లీ ఆరోగ్య శాఖ కార్యదర్శి

కేంద్ర మంత్రి అమిత్​ షా దిల్లీలో పరీక్షల వేగాన్ని రెండింతలు పెంచాలని ఆదివారం ఆదేశించారు. క్రమంగా ఆ వేగాన్ని మూడింతలు పెంచి కరోనా వ్యాప్తిని తగ్గించడానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కంటైన్​మెంట్​ జోన్లలోని ప్రతి పోలింగ్​ కేంద్రంలోనూ కరోనా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. హాట్​స్పాట్​ ప్రాంతాల్లో.. ఇంటింటికి వెళ్లి కరోనా పరీక్షలు నిర్వహించాలని నిర్దేశించారు అమిత్ షా.

దిల్లీలో ఆదివారం ఒక్కరోజే.. 2, 224 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 41 వేలు దాటిపోయింది. 1,327 మంది కొవిడ్ బారిన పడి మృతి చెందారు.

ఇదీ చదవండి:పెళ్లైన మూడో రోజే కరోనా పాజిటివ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.