గుజరాత్ అరవళ్లి జిల్లాలో గ్యాస్ లీకైంది. దేవ్నిమొరి ప్రాంతంలోని వాటర్ ట్రీట్మెంట్ ప్లాంటులో క్లోరిన్ వాయువు వెలువడింది. ఈ ఘటనతో సమీపంలోని రెండు గ్రామాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఫలితంగా అక్కడి ప్రజలు సరిగ్గా ఊపిరాడక, దగ్గు వంటి సమస్యలను ఎదుర్కొన్నారు.
![Gas leak incident at Aravalli in Gujarat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8673457_1.jpg)
అయితే.. తక్షణమే అగ్నిమాపక దళాలు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గ్యాస్‌ను అదుపుచేసే క్రమంలో క్లోరిన్ వాయువు పీల్చిన ఓ డ్రైవర్ అస్వస్థతకు గురయ్యాడు. అతడ్ని ఆస్పత్రిలో చేర్పించారు.
![Gas leak incident at Aravalli in Gujarat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8673457_2.jpg)
ఆ వాటర్‌ప్లాంట్‌లో సుమారు 60 కిలోల వరకూ క్లోరిన్ రసాయనం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: భరత భూమిలో అడుగంటిన నీరు!