దేశ రాజధాని దిల్లీలో అల్లరి మూకలు రెచ్చిపోయాయి. అందరూ చూస్తుండగానే ఓ బృందంపై ముష్టిఘాతాలు కురిపించింది మరో ముఠా. రైల్లో జరిగిన ఘర్షణ ఈ ముష్టియుద్ధానికి దారి తీసిందని తెలుస్తోంది.
ఘజియాబాద్ పరిధిలోని 'లోని రైల్వే స్టేషన్'లో ఈ గొడవ జరుగుతుండగా చుట్టూ ఉన్నవారు భయంతో వణికిపోయారు. ముష్టిఘాతాల అనంతరం ఇరు బృందాలు ఏమీ తెలియదన్నట్లుగా అక్కడి నుంచి వెళ్లిపోయాయి.
వీడియో ఆధారంగా ఆర్పీఎఫ్ పోలీసులను విలేకరులు ప్రశ్నించారు. పోలీసులు వీడియోను పరిశీలించి గుర్తుతెలియని ప్రయాణికులుగా నిర్ధరించారు. ఘటనపై కేసు నమోదుచేశారు. చిల్లర గ్యాంగ్ ఆచూకీ కనిపెట్టేందుకు దర్యాప్తు చేపట్టనున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి: చంద్రయాన్-2: జాబిల్లితో ఓ మాట చెప్పాలని...