ETV Bharat / bharat

అత్యాచార బాధితురాలిపై పోలీసు పైశాచికం..!

ఉత్తర్​ప్రదేశ్​లో మహిళలపై వరుస అత్యాచారాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అత్యాచారంపై ఫిర్యాదు చేయడానికి వచ్చిన తనను ఎస్ఐ బలవంతం చేశాడని ఓ మహిళ ఆరోపించింది.

Gang-rape survivor alleges rape by cop in UP police station
'సామూహిక అత్యాచార బాధితురాలిపై పోలీసు అత్యాచారం'
author img

By

Published : Dec 25, 2020, 2:26 PM IST

సమాజంలో స్త్రీలకు రక్షణ కరవైంది. కాపాడాల్సిన పోలీసే మహిళపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన ఉత్తర్​ప్రదేశ్​ షహజాన్​పుర్​లో జరిగింది.

ఏం జరిగింది..?

తనను కొందరు సామూహిక అత్యాచారం చేశారని ఫిర్యాదు చేయడానికి ఓ మహిళ షహజాన్​పుర్​ తాలూకా జలాదాబాద్​ పోలీస్​స్టేషన్​కు వెళ్లింది. అయితే ఫిర్యాదు తీసుకోవాల్సిన ఎస్​ఐ​.. విచారణ పేరుతో గదిలోకి పిలిచి ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ మేరకు భాదితురాలు వెల్లడించింది. నవంబర్​ 30న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఈ ఘటనపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని బాధితురాలు వాపోయింది. దీంతో ఏడీజీ అవినాశ్ చంద్రను కలిసి ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. ఈ ఘటనపై సత్వర దర్యాప్తుకు ఏడీజీ ఆదేశించారు.

అయితే సదరు మహిళ ఇప్పటికే రెండు డజన్లకు పైగా ఫిర్యాదులు ఇచ్చిందని.. వాటిపై విచారణ జరుగుతోందని అధికారులు వెల్లడించారు. ఆమె పోలీసులపై నిరాధార ఆరోపణలు చేస్తోందన్నారు.

మరోవైపు ఈ ఆరోపణలను షహజాన్​పూర్​ ఎస్పీ ఎస్.ఏ ఆనంద్​ ఖండించారు.

ఇదీ చదవండి: వైరల్​: బాత్రూంలో కట్టలకొద్దీ డబ్బు పారేసి...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.