ETV Bharat / bharat

గాంధీ 150: చిమ్మచీకట్లో విరిసిన వెలుగు రేఖ - సత్యం

'హిందు, ముస్లిం, పార్శీలు కలిసి ఉండాలి.. దేశంలో మత సామరస్యం వెల్లివిరియాలి..' ఇది 12 ఏళ్ల వయసులో ఓ బాలుడు కన్న కల. అయితే అప్పుడు ఆ కుర్రాడికి తెలిసి ఉండకపోవచ్చు.. 30 కోట్ల మందిని ఏకం చేసి రవి అస్తమించని బ్రిటిష్​ సామ్రాజ్యాన్ని తాను గడగడలాడిస్తాను అని. కత్తి దూయకుండా... తుపాకీ పేల్చకుండా.. సత్యాగ్రహంతో భరతమాతకు స్వేచ్ఛ కల్పిస్తానని! ఆ బాలుడే మహాత్మా గాంధీ.

గాంధీ 150: చిమ్మచీకట్లో విరిసిన వెలుగు రేఖ
author img

By

Published : Sep 10, 2019, 7:01 AM IST

Updated : Sep 30, 2019, 2:12 AM IST

గుజరాత్​ పోర్​బందర్​కు చెందిన కుర్రాడు అతడు. రాజ్​కోట్​ పాఠశాలలో చదివే రోజుల్లోనే మత సామరస్యం, మనుషులంతా ఒక్కటే అనే భావాలు ఇనుమడింపజేసుకున్నాడు. బారిష్టర్​ చదివేందుకు ఇంగ్లాండ్​ వెళ్లే ముందు తన తల్లి పాదాల చెంత ప్రమాణం చేశాడు. స్వచ్ఛంగా జీవిస్తానని, ఎప్పటికీ క్రమశిక్షణ వదలనని హామీ ఇచ్చాడు. అతడే మోహన్​దాస్​ కరమ్​చంద్​ గాంధీ.

రాటుదేలింది అక్కడే...

గాంధీ తన తొలినాళ్లలో న్యాయవాదిగా దక్షిణాఫ్రికాలో 20 ఏళ్లకు పైగా ఉన్నారు. ఎన్నో అవమానాలు, భౌతిక దాడులు.. గాంధీని అసహాయులకు నాయకుడ్ని చేశాయి. నిరంకుశ పాలకులు, జాతి విద్వేషకులకు వ్యతిరేకంగా అహింసా ఉద్యమం చేసేందుకు ఆయన్ను పురిగొల్పాయి.

అదే పెద్ద మలుపు...

1906... గాంధీ జీవితాన్నే కాదు ఆధునిక ప్రపంచ చరిత్రను మార్చిన సమయం ఇది. తొలిసారి దక్షిణాఫ్రికాలోనే 'సత్యాగ్రహం' మొదలుపెట్టారు మాహాత్ముడు. సత్యాగ్రహ ఉద్యమం గురించి భారత రచయిత రామచంద్ర గుహ మాటల్లో...

"కత్తి దూయలేదు. తుపాకీ పేల్చలేదు. అయినప్పటికీ ఓ పెద్ద శత్రువును ఓడించిన గాంధీ హీరోయిజానికి సమానమైనది ఎక్కడా లేదు."
- రామచంద్ర గుహ, రచయిత

దక్షిణాఫ్రికాకు చెందిన రామచంద్ర గుహ స్నేహితుడు ఒకరు ఆయనకు రాసిన ఓ లేఖలో గాంధీ గురించి ప్రస్తావిస్తూ.. 'మీరు మాకు ఓ న్యాయవాదిని ఇస్తే.. మేము మీకు మాహాత్ముడ్ని ఇచ్చాం' అని పేర్కొన్నారు.

ఈ భూమిపై ఉన్న అతి శక్తిమంతమైన ఆయుధంగా సత్యాగ్రహాన్ని అభివర్ణించారు మాహాత్ముడు.

గాంధీ వచ్చేసరికి...

ఎక్కడ చూసినా నిరాస, నిస్పృహ, నిస్సహాయత, గందరగోళం. ఇది దక్షిణాఫ్రికా నుంచి గాంధీ వచ్చేసరికి.. భారత్​ పరిస్థితి. గాంధీ లక్ష్యం ఒక్కటే.. ఆంగ్లేయుల దాస్యశృంఖలాల నుంచి భరతమాతకు స్వేచ్ఛను కల్పించాలి. సూటు వేసుకొని ఇంగ్లాండ్​లో బారిష్టర్​ చేసిన గాంధీ.. భారత్​లో తెల్లవాడికి వ్యతిరేకంగా ఖద్దరు కట్టి పోరుబాట పట్టారు. సత్యాగ్రహం, అహింస, ప్రేమ అనే ఆయుధాలను చేతపట్టి రణరంగంలో కదం తొక్కారు. గాంధీ చేసిన యుద్ధం గురించి అరబ్​ కవి మిఖాయిల్​ నోయిమా చెప్పిన తీరు అజరామరం.

"గాంధీ చేతిలో ఉన్న కర్ర.. కత్తి కంటే పదునైనది. ఆయన బక్కపలచని ఒంటిపై ఉన్న తెల్లని వస్త్రమే... తెల్లవాడి వేల తుటాల నుంచి కాపాడే రక్షణ కవచం. ఆయన చెంతన ఉండే మేక... బ్రిటిష్​ సింహం కన్నా బలమైనది."
- మిఖాయిల్​ నోయిమా, అరబ్​ కవి

రొమైన్​ రోలేండ్ అనే ఫ్రెంచ్​ రచయిత గాంధీ ఉద్యమం ఎంత శక్తిమంతమైనదో తెలిపారు.

"మాహాత్మా గాంధీ.. 30 కోట్ల మంది ప్రజల్ని ఒక్క తాటిపైకి తెచ్చి.. బ్రిటిష్​ సామ్రాజ్యాన్ని కుదిపేశారు. దాదాపు 2 వేల ఏళ్లుగా ప్రపంచ చరిత్రలో ఎవ్వరూ చూడని అతి శక్తిమంతమైన ఉద్యమానికి నాంది పలికారు."
-రొమైన్​ రోలేండ్, ఫ్రెంచ్​ రచయిత

ఆయన మాటలే తూటాలు...

ప్రేమ, క్షమ, దయను గాంధీ చాలా ప్రభావవంతంగా జీవితంలో ఉపయోగించారు. వ్యక్తిగత జీవితంలోనూ.. ఎప్పుడైనా తప్పు చేసినట్లు అనిపిస్తే ఆయన తన సొంతవాళ్లనూ క్షమాపణ కోరిన సందర్భాలు ఉన్నాయి. ఒకసారి అలిగిన తన కుమారుడికి మహాత్ముడు మృదువుగా చెప్పిన మాటలు ఆయన ఔన్నత్యాన్ని చాటాయి.

'నీ తండ్రి తప్పు చేసినట్లు నీకు అనిపిస్తే.. దయచేసి ఆయన్ను క్షమించు' అని గాంధీ ఆయన కుమారుడ్ని కోరారు.

ప్రశాంతతకు మారుపేరైన బుద్ధుడు, కరుణామయుడైన ఏసుతో గాంధీని పోలుస్తారు కొందరు. ఒకసారి ఇంగ్లాండ్​ క్రిస్టియన్​ మిషనరీలకు చెందిన వారు సేవాగ్రామ్​ను సందర్శించి.. మేము లోపల ఏసును చూశాం అంటూ మురిసిపోయారు.

ఇప్పుడు అంతా తారుమారు...

గాంధీ పంచిన మానవత్వపు పరిమళాలు.. ఇప్పుడు అధికారం, అత్యాశ, హింస, లంచం అనే చిమ్మచీకటిలో దారి తెలియక నిలిచిపోయాయి. వాటిని ఎదుర్కొని లక్ష్యం చేరాలంటే గాంధీ చెప్పిన సిద్ధాంతాల వెలుగు రేఖలే శరణ్యం.

బ్రిటిష్​ జర్నలిస్ట్​ కింగ్​స్లే మార్టిన్​ చెప్పిన మాటలు అక్షర సత్యాలు.

"బాధ, హింసను ఎదుర్కొని ఆనందాన్ని అందుకోవడానికి సత్యం, ప్రేమ ఎనలేని సాయం చేస్తాయనే నమ్మకానికి.. గాంధీ జీవితమే నిదర్శనం."
- కింగ్​స్లే మార్టిన్​, బ్రిటిష్​ జర్నలిస్ట్

మహాత్ముడు చెప్పిన సిద్ధాంతాలను ఆయన జయంతి సందర్భంగా మళ్లీ తలచుకుంటూ భవిష్యత్తుపై భరోసా కల్పించుకుందాం... ఆయనదారిలో అడుగులేద్దాం.

(రచయిత- ఎ. ప్రసన్న కుమార్​, సెంటర్​ ఫర్​ పాలిసీ స్టడీస్​ వ్యవస్థాపక అధ్యక్షుడు, విశాఖపట్నం)

Mumbai, Sep 09 (ANI): Telugu sensation Vijay Deverakonda was spotted with actress Kiara Advani outside a studio in Mumbai. She wore a pink lehenga with embroidery teamed up with net dupatta. Vijay looked dapper in a blue kurta teamed up with a golden dhoti pant and matching jutis. Both of them looked completely royal in traditional attires. Vijay and Kiara posed happily for the shutterbugs. Meanwhile, Kiara has some good projects such as 'Laxmmi Bomb' with Akshay Kumar, 'Good News,' and 'Shershah.'
Last Updated : Sep 30, 2019, 2:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.