మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా బుధవారం దిల్లీలో రెండు గిన్నిస్ రికార్డులు నమోదయ్యాయి. దిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతానికి చెందిన విద్యార్థులు భారీ సంఖ్యలో ఒకేచోట చేరి.. పర్యావరణ మనుగడ గురించి పాఠాలు చెప్పడం ఇందులో ఒక రికార్డు. ఈ కార్యక్రమానికి సుమారు 5వేల మంది విద్యార్థులు హాజరయ్యారు.
అనంతరం ఆ విద్యార్థులంతా ఒకేసారి సౌర విద్యుత్తు దీపాలు వెలిగించి రెండో రికార్డు నెలకొల్పారు.
-
Congratulations to over 10,000 students for setting Guiness Book of World Records by "assembling & lighting" their own solar lamps as part of the Global Student Solar Assembly at IGI Stadium in New Delhi. This is #NewIndia. #GandhiJayanti #MannMeinBapu pic.twitter.com/dwOKSzmxAk
— Prakash Javadekar (@PrakashJavdekar) October 2, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Congratulations to over 10,000 students for setting Guiness Book of World Records by "assembling & lighting" their own solar lamps as part of the Global Student Solar Assembly at IGI Stadium in New Delhi. This is #NewIndia. #GandhiJayanti #MannMeinBapu pic.twitter.com/dwOKSzmxAk
— Prakash Javadekar (@PrakashJavdekar) October 2, 2019Congratulations to over 10,000 students for setting Guiness Book of World Records by "assembling & lighting" their own solar lamps as part of the Global Student Solar Assembly at IGI Stadium in New Delhi. This is #NewIndia. #GandhiJayanti #MannMeinBapu pic.twitter.com/dwOKSzmxAk
— Prakash Javadekar (@PrakashJavdekar) October 2, 2019
మహాత్ముడికి నివాళిగా కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ దిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది.
ఏడు చెట్లను పెంచండి..
కార్యక్రమానికి హాజరైన పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ విద్యార్థులను అభినందించారు. వారి చేతులతోనే కాదు హృదయాలతో సౌర దీపాలను తయారు చేశారని కొనియాడారు. ప్రతి ఒక్కరు తమ జీవిత కాలంలో కనీసం ఏడు చెట్లను పెంచటం ద్వారా సొంతంగా ప్రాణవాయువు నిధి (స్వీయ ఆక్సిజన్ నిధి) ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రకృతి పట్ల హింసాత్మకంగా వ్యవహరించబోమని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.
ఇదీ చూడండి: గాంధీ 150: ఈటీవీ భారత్ కృషికి సర్వత్రా అభినందనల వెల్లువ