భారత వాయుసేనలో నవశకం మొదలైంది. దేశ ప్రజలు ఎంతగానో ఎదురుచూసిన రఫేల్ యుద్ధ విమానాలు బుధవారం మధ్యాహ్నం 3గంటలకు హరియాణాలోని అంబాలా ఎయిర్‌బేస్‌కు చేరుకున్నాయి. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో గేమ్‌ఛేంజర్ 'రఫేల్' వాయుసేనకు అందుబాటులోకి రావడం అత్యంత కీలక విషయం.
-
#WATCH Haryana: Touchdown of Rafale fighter aircraft at Ambala airbase. Five jets have arrived from France to be inducted in Indian Air Force. (Source - Office of Defence Minister) pic.twitter.com/vq3YOBjQXu
— ANI (@ANI) July 29, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH Haryana: Touchdown of Rafale fighter aircraft at Ambala airbase. Five jets have arrived from France to be inducted in Indian Air Force. (Source - Office of Defence Minister) pic.twitter.com/vq3YOBjQXu
— ANI (@ANI) July 29, 2020#WATCH Haryana: Touchdown of Rafale fighter aircraft at Ambala airbase. Five jets have arrived from France to be inducted in Indian Air Force. (Source - Office of Defence Minister) pic.twitter.com/vq3YOBjQXu
— ANI (@ANI) July 29, 2020
నిరంతర పర్యవేక్షణ..
రఫేల్ రాక కోసం భారత ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా చేసింది. అంబాలా వైమానిక ప్రాంతాన్ని ఉదయం నుంచే నిరంతరం పర్యవేక్షించాయి వైమానిక దళ హెలికాప్టర్లు.
ఇదీ చూడండి:- గేమ్ ఛేంజర్ 'రఫేల్' ఎందుకింత ప్రత్యేకం?
రఫేల్ టచ్‌డౌన్ నేపథ్యంలో మంగళవారమే అంబాలాలో 144 సెక్షన్ విధించింది హరియాణా ప్రభుత్వం.
స్వాగతం ఇలా...
ఫ్రాన్స్ నుంచి సోమవారం బయలుదేరిన ఐదు రఫేల్ యుద్ధ విమానాలు.. ఆ రోజు సాయంత్రమే మధ్యలో యూఏఈలో దిగాయి. అనంతరం భారత్‌కు బయలుదేరాయి.
ఇదీ చూడండి:- ఔరా: ఆకాశంలోనే ఇంధనం నింపుకున్న 'రఫేల్'!
టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పశ్చిమ అరేబియా సముద్రంలో ఉన్న ఐఎన్ఎస్ కోల్‌కతాతో సంప్రదింపులు జరిపాయి యుద్ధ విమానాలు.
అనంతరం బుధవారం మధ్యాహ్నం భారత గగనతలంలోకి ప్రవేశించాయి. రెండు సుఖోయ్-30ఎమ్కేఐ విమానాలతో రఫేల్ జెట్లకు స్వాగతం పలికింది ప్రభుత్వం. గాలిలో పక్షుల్లా విహరిస్తున్న విమానాలకు సంబంధించిన చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
అంబాలా ఎయిర్‌బేస్‌లో టాచ్డౌన్ అయిన వెంటనే యుద్ధ విమానాలకు వాటర్ సెల్యూట్‌తో ఘన స్వాగతం పలికింది వాయుసేన.
'దేశ రక్షణ ఓ పుణ్యం..'
భారత్ భూభాగాన్ని ముద్దాడిన రఫేల్‌కు ప్రధాని నరేంద్రమోదీ స్వాగతం పలికారు. ఈ విషయాన్ని సంస్కృతంలో ట్వీట్ చేశారు. "దేశ రక్షణ ఒక పుణ్యం, ఒక వ్రతం, ఒక యజ్ఞం" అని పేర్కొన్నారు.
రఫేల్ టచ్డౌన్పై రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. దేశానికి పొంచి ఉన్న ముప్పును వైమానిక దళం దీటుగా ఎదుర్కోగలదని... భారత ప్రాదేశిక సమగ్రతను ప్రశ్నించేవారికి రఫేల్ ఓ సమాధానమిస్తుందని చైనాను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
36 రఫేల్ యుద్ధ విమానాల కోసం భారత్- ఫ్రాన్స్ మధ్య 2016లో ఒప్పందం కుదిరింది. తొలి విడతలో భాగంగా ఐదు జెట్లను భారత్‌కు అప్పగించింది ఫ్రాన్స్. మిగిలినవి వచ్చే ఏడాదికల్లా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నట్టు అధికారవర్గాల సమాచారం.
ఇదీ చూడండి:- హ్యామర్ క్షిపణితో రఫేల్‌కు మరింత శక్తి!