ETV Bharat / bharat

లాక్​డౌన్​ లాభాలకు 'అన్​లాక్​'తో గండి! - COVID-19

సుమారు రెండున్నర నెలల లాక్​డౌన్​తో చేకూరిన ప్రయోజనాలు.. ప్రస్తుత అన్​లాక్​తో కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అన్​లాక్​ వల్ల ప్రజలు మళ్లీ పాత పద్ధతిలోకి వెళతారని, కేసులు పెరిగిపోతాయని తెలిపారు. భారీ స్థాయిలో వైరస్​ వ్యాప్తి జరిగితే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.

Gains from lockdown possibly lost in unlock
లాక్​డౌన్​ ప్రయోజనాలు అన్​లాక్​తో ఉఫ్​
author img

By

Published : Jun 10, 2020, 2:37 PM IST

కరోనా మహమ్మారి కట్టడికి విధించిన లాక్​డౌన్​ ప్రయోజనాలు అన్​లాక్(ఆంక్షల ఎత్తివేత)​తో కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు ప్రజారోగ్య సంరక్షణ​ నిపుణులు రమణ ధార. వైరస్​ బారి నుంచి గ్రామీణ ప్రజలను కాపాడాలని, భారీ స్థాయిలో కేసుల వ్యాప్తి జరిగితే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.

" అన్​లాక్​ వల్ల ప్రజలు భౌతిక దూరం పాటించకపోవటం, మాస్కులు సరైన పద్ధతిలో వినియోగించకపోవటం వంటి పాత అలవాట్లకు వెళతారు. వలస కార్మికుల సంరక్షణకు చర్యలు చేపట్టాలి. గ్రామీణ ప్రాంతాల్లో వారి ఇళ్లకు సమీపంలోనే క్వారంటైన్​ చేయాలి. తద్వారా వలస కార్మికుల రాకపై ఎలాంటి ఆందోళన లేకుండా ప్రజలకు వైరస్​ నుంచి రక్షణ లభిస్తుంది. సరిపడా పరీక్ష కిట్లు, సరైన వైద్య సౌకర్యాలు లేని పల్లెల్లో కేసులు భారీగా పెరుగుతాయి. లాక్​డౌన్​తో చేకూరిన ప్రయోజనం ప్రస్తుత అన్​లాక్​తో కోల్పోవచ్చు."

- రమణ ధార, ప్రొఫెసర్ ఇండియన్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ పబ్లిక్​ హెల్త్​, హైదరాబాద్​,

ప్రజల్లో వైరస్​ వ్యాప్తిపై సరైన సమాచారం కోసం పరీక్షల వేగం పెంచాలని అభిప్రాయపడ్డారు రమణ. పరీక్ష ప్రమాణాలు, పద్ధతులు దేశవ్యాప్తంగా ప్రామాణికంగా ఉండాలన్నారు. గతంలో వైరస్​ కట్టడి చేయగలిగిన ప్రాంతాల్లో మళ్లీ కేసులు పెరుగుతున్నాయని, ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి పరిస్థితే ఎదురవుతున్నట్లు గుర్తు చేశారు.

అందుకే మరణాలు తక్కువ..

కాంటాక్ట్​ ట్రేసింగ్​, పాజిటివ్​ కేసులను ఐసోలేషన్​ చేయటం, అనుమానితులను క్వారంటైన్​కు తరలించటం, తీవ్ర అనారోగ్యానికి గురైన వారికి సరైన చికిత్స అందించేందుకు ఆస్పత్రులను సిద్ధం చేయటం ద్వారానే భారత్​ మరణాల రేటును కనిష్ఠ స్థాయిలో ఉంచగలిగిందన్నారు ప్రొఫెసర్​.

ఇదీ చూడండి: కరోనా విజృంభణతో ఆ రాష్ట్ర సరిహద్దుల మూసివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.