12 ఏళ్లకోసారి జరిగే కుంభమేళా.. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక, సాంస్కృతిక మేళాగా చెబుతారు. ఈ ఏడాది కుంభమేళా జనవరి 14న ప్రారంభమై, ఏప్రిల్ వరకూ కొనసాగుతుంది. సనాతన హిందూధర్మం పాటించేవాళ్లంతా ఒక్కసారైనా ఈ మేళాలో పాలు పంచుకోవాలని, తమ పాపాలన్నీ కడిగేసుకోవాలని అనుకుంటారు. కానీ కరోనా కారణంగా పర్యటనలు, యాత్రలకు ఆటంకం కలిగింది. ఇలాంటి పరిస్థితుల్లో కుంభమేళాలో పాల్గొనడం ప్రతిఒక్కరికీ కుదరకపోచ్చు. అందుకే మేళాలో పాల్గొన్న అనుభూతి అందరికీ అందించేందుకు శాంతికుంజ్ గాయత్రి పరివార్ ఆశ్రమం.. గడపగడపకూ హరిద్వార్ పేరుతో ఓ ప్రచారానికి శ్రీకారం చుట్టింది.
"శాంతికుంజ్‌లోని ఈ బృందం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పుట్టింది. శాంతికుంజ్‌కు, మహాకుంభమేళాకు ఈ ఏడాది గోల్డెన్ జూబ్లీ. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే ఏడాదిగా దీన్ని చెప్పుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిఒక్కరూ గురుదేవ్, మాతాజీ ఆశీస్సులు తీసుకోవాలని అందరూ కోరుకుంటారు."
- డా చిన్మయ్ పాండ్య, ఉపకులపతి, దేవసంస్కృతి విశ్వవిద్యాలయం
"మొదటిదశలో దేశవ్యాప్తంగా 50 వేల ఇళ్లకు చేరుకుంటాం. అన్ని గడపలకూ గంగాజలం, గంగామాత చిత్రపటం, కుంభమేళా ప్రాముఖ్యతను వివరించే పుస్తకం అందజేస్తాం."
- కేదార్ ప్రసాద్ దూబే, శాంతికుంజ్ సభ్యుడు
స్వయంగా గంగామాతే భక్తుల ఇళ్లకు చేరుకోవడం చరిత్రలో ఇదే మొదటిసారి. గంగాజలం, వేదమాత గాయత్రి చిత్రపటం సహా యుగ సాహిత్యాన్ని 10 లక్షల ఇళ్లకు చేరవేయడం వెనక తమ ఉద్దేశమేమిటో వివరిస్తున్నారు శాంతికుంజ్‌కు చెందిన గోపాల్ కృష్ణ.
"కొవిడ్ సంక్షోభం కారణంగా ఎంతో కల్లోలం జరిగింది. హరిద్వార్‌కు రావాలనుకున్న ఎంతోమంది భక్తులు కొవిడ్ నిబంధనల వల్ల రాలేకపోతున్నారు. గ్రామాల దేశం మనది. అందుకే గంగాజలాన్ని కుంభమేళాలో పాల్గొనేందుకు హరిద్వార్‌కు రాలేకపోతున్న గ్రామాల ప్రజలకు చేరువ చేయాలని నిశ్చయించుకున్నాం. కుంభమేళా విశిష్టత ఈ తరానికి తెలియజేయడం కూడా మా ప్రధాన ఉద్దేశం."
- డా గోపాల్ కృష్ణశర్మ, శాంతికుంజ్ సభ్యుడు
కుంభమేళా ప్రారంభమే కాదు.. గాయత్రీ తీర్థ శాంతికుంజ్ ఏర్పాటై కూడా ఈ ఏడాదితో 50 ఏళ్లు పూర్తవుతోంది. గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో పాల్గొనాలని భావిస్తున్న లక్షలాది మందికి ఇంటి నుంచే మేళాలో పాల్గొన్న అనుభూతి అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది శాంతికుంజ్.
ఇదీ చూడండి: అదిరిపోయిన సర్ప్రైజ్- అవాక్కయిన పెళ్లికూతురు