కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర నివాసంలో ఆదాయపన్ను విభాగం సోదాలు నిర్వహిస్తోంది. దాదాపు 30 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు జరుపుతున్నట్లు సమాచారం. తుమకూర్‌లోని సిద్ధార్థ గ్రూప్ సంస్థల్లో అధికారుల బృందం సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
పరమేశ్వరకు సంబంధించిన ట్రస్ట్ ఆధ్వర్యంలోని వైద్య కళాశాలలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ఐటీ అధికారులు దాడులు చేస్తున్నట్లు సమాచారం. కర్ణాటక శాసనసభ సమావేశాల ప్రారంభానికి కొన్నిగంటల ముందు ఐటీ దాడులు ప్రారంభం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
అభ్యంతరం లేదు: పరమేశ్వర
ఐటీ దాడులపై ఎలాంటి భయం లేదని పరమేశ్వర స్పష్టం చేశారు. వాళ్లు సోదాలు చేసుకుంటే తనకెలాంటి అభ్యంతరం లేదన్నారు. ఏదైనా తప్పుంటే సరిదిద్దుకునేందుకు సిద్ధమని తెలిపారు.
ఖండించిన సిద్ధరామయ్య
అయితే ఈ దాడులను మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్రంగా ఖండించారు. విధానపరమైన, అవినీతికి సంబంధించిన విషయాల్లో తమను ఎదుర్కొనే ధైర్యం లేక ఐటీ దాడులు చేయిస్తున్నారంటూ ట్వీట్ చేశారు.
ఇదీ చూడండి:- 'కాంగ్రెస్ ఆత్మపరిశీలన చేసుకోవాలి- ఇది అత్యవసరం'