వర్షాలు బాగా కురవాలని ప్రార్థిస్తూ కప్పలకు పెళ్లి చేశారన్న వార్తలు చూశాం. కానీ ఈ కథనం విభిన్నం. భారీగా కురుస్తోన్న వర్షాలను ఆపేందుకు వింత ప్రయత్నం చేశారు మధ్యప్రదేశ్లోని షాజాపుర్ వాసులు. కాళీ సింధ్ గ్రామంలో బతికి ఉన్న వ్యక్తికి శవయాత్ర నిర్వహించారు. విజృంభిస్తున్న వరుణుడు... ఈ పూజతో తగ్గుతాయని స్థానికుల విశ్వాసం.
సజీవంగా ఉన్న వ్యక్తిని పాడెపై ఉంచి, గ్రామంలో ఊరేగించారు ప్రజలు. నృత్యాలు చేస్తూ... శ్మశానానికి తీసుకెళ్లారు.
మధ్యప్రదేశ్లో కురుస్తోన్న భారీ వర్షాలకు ఇప్పటివరకు 198 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ భారీ వర్షాలను ఆపేందుకు ఇటీవల ఓ కప్పల జంటకు విడాకులు ఇచ్చారు.
ఇదీ చూడండి: పచ్చని 'కప్ప'ల కాపురంలో విడాకుల చిచ్చు!