ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. గత కొన్ని రోజులుగా ఇంధన ధరలు పెరుగుతూ వస్తున్నయి. తాజాగా మరోసారి చమురు ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్, డీజిల్పై 35 పైసలు చొప్పున పెరిగాయి. దీంతో దిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.86, డీజిల్ రూ.76 కు చేరుకున్నాయి. ముంబయిలో అయితే లీటర్ పెట్రోల్ రూ.92.62, డీజిల్ రూ.79.83గా ఉంది. ధరలు సరికొత్త గరిష్ఠానికి చేరాయి.
పలు నగరాల్లో ఇంధన ధరలు 90 మార్క్ దాటాయి. దీంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో చమురు ధరల పెంపుపై వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే పెట్రో ధరలపై కేంద్రానికి చమురు మంత్రిత్వ శాఖ ఇటీవల ఆర్థిక శాఖకు లేఖ రాసింది. ఇంధనంపై విధించిన అదనపు సుంకాలను తొలగించాలని ఇందులో సూచించింది.
ఇదీ చదవండి : మూడు రాష్ట్రాల ఎన్నికలకు ఈసీ కసరత్తు