ETV Bharat / bharat

మధుయాస్కీ ఫిర్యాదుతో క్వారంటైన్​ స్టాంప్​​లో కొత్త సిరా - హోంక్వారంటైన్​ స్టాంప్​ సిరాలో రసాయనాలు

దిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో హోం క్వారంటైన్​ స్టాంప్​​లో కొత్త సిరా వాడుతున్నారు. విదేశాల నుంచి వచ్చిన ఓ కాంగ్రెస్ మాజీ​ ఎంపీ చేసిన ఫిర్యాదు మేరకు... అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Fresh ink for COVID quarantine stamp at Delhi airport after Cong leader's complain
కాంగ్రెస్​ ఎంపీ ఫిర్యాదుతో క్వారంటైన్​ స్టాంప్​​లో కొత్త సిరా
author img

By

Published : Oct 5, 2020, 4:42 PM IST

Updated : Oct 5, 2020, 4:51 PM IST

నిజామాబాద్​ కాంగ్రెస్​ పార్టీ మాజీ ఎంపీ మధుయాస్కీ గౌడ్​ ఫిర్యాదుతో దిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో హోం క్వారంటైన్​ స్టాంపింగ్​లో కొత్త సిరాను ఉపయోగిస్తున్నారు.

శనివారం విదేశాల నుంచి దిల్లీకి చేరుకున్న యాస్కీకి... హోం క్వారంటైన్​ స్టాంప్​ వేశారు అధికారులు. అయితే దీని వల్ల నొప్పి, దురద వచ్చాయి. ఈ విషయాన్ని ట్విట్టర్​ వేదికగా కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు స్పందించిన అధికారులు... కొత్త సిరాను వాడుతున్నట్లు తెలుస్తోంది.

మంత్రి జోక్యంతో...

'విదేశాలను నుంచి వస్తున్న ప్రయాణికులకు వేస్తున్న సిరాలో రసాయనాలను పరీక్షించగలరా?' అంటూ ట్వీట్​ చేశారు యాస్కీ.

'దీనిపై నేను విమానాశ్రయ అధికారులతో మాట్లాడాను' అని బదులిచ్చారు పౌర విమానయాన మంత్రి హార్​దీప్​ సింగ్​ పూరి.

నిబంధనల ప్రకారం విదేశాల నుంచి దిల్లీ చేరకున్న ప్రయాణికులకు ఏడు రోజులు సంస్థాగతమైన క్వారంటైన్​, మరో ఏడురోజులు హోం క్వారంటైన్​లో ఉండాలి. ప్రయాణానికి 96 గంటల ముందు కొవిడ్​ పరీక్షల్లో నెగెటివ్​ వచ్చిన వారికి సంస్థాగతమైన నిర్బంధం నుంచి మినహాయింపు ఇస్తారు.

ఇదీ చూడండి: 'రైతులను అంతం చేయడానికే వ్యవసాయ చట్టాలు'

Last Updated : Oct 5, 2020, 4:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.