ఆర్థిక వ్యవస్థకు ఊపిరిలూదేందుకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం చేసిన ప్రకటనపై ప్రధాని మోదీ స్పందించారు. ఈ నిర్ణయం వల్ల రైతులు, చిరు వ్యాపారులకు ఆహార భద్రత, రుణాలను బలోపేతం చేసేందుకు ఉపయోగపడతుందని తెలిపారు.
ఈ రోజు ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన.. ప్రధానంగా రైతులు, వలసకూలీలకు అండగా నిలుస్తుంది. ఈ చర్యలు ఆహార భద్రతను పెంపొందిస్తాయి. ఇదంతా రైతులు, చిరు వ్యాపారుల సహాయంతోనే సాధ్యపడింది.
నరేంద్ర మోదీ, ప్రధాని
'ఇదంతా ఉత్తుత్తి ప్యాకేజీ..'
దేశానికి మోదీ చేసిన వాగ్దానాలతో పోలిస్తే.. ఆర్థిక ప్యాకేజీ చాలా తక్కువని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ ప్యాకేజీని జుమ్లా ప్యాకేజీ(ఉత్తిత్తి ప్యాకేజీ)గా అభివర్ణించారు కాంగ్రెస్ సీనియర్ నేత ఆనందర్ శర్మ.
కార్మికులు, వలస కూలీలకు సాయం అందించడం సహా ఆర్థిక వ్యవస్థకు ఊతమందించడానికి దేశ జీడీపీలో 10 శాతం విలువ చేసే ప్యాకేజీని కేటాయిస్తున్నట్లు మోదీ నాటకీయ ప్రకటనలు చేశారు. నిబద్దతతో మెలుగుతున్నట్లు ప్రధాని దేశం ప్రజలను నమ్మిస్తున్నారు. ఆర్థిక మంత్రి ఆశలన్నీ నీరుగార్చారు.
ఆనంద్ శర్మ, కాంగ్రెస్ సీనియర్ నేత.