కరోనా టీకాను ఉచితంగా అందిస్తామన్న హామీ ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకురాదని ఈసీ స్పష్టం చేసింది. బిహార్ ఎన్నికల సందర్భంగా 'ఉచిత కొవిడ్ టీకా' హామీని ఎన్నికల ప్రణాళికలో చేర్చింది భాజపా. అయితే, ఇది పక్షపాతంతో కూడినదిగా పేర్కొంటూ ఓ సమాచార హక్కు కార్యకర్త ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కేంద్రం తన అధికారాలను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు.
ఇదీ చదవండి:భాజపా 'టీకా' ప్రకటనపై విపక్షాల రగడ
ఈ ఫిర్యాదుపై స్పందించిన ఈసీ.. భాజపా చేసిన హామీ.. ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందికి రాదని వెల్లడించింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఎనిమిదో భాగంలో పార్టీల ఎన్నికల ప్రణాళికకు సంబంధించిన మార్గదర్శకాలున్నాయని పేర్కొంది. ఈ మార్గదర్శాకాల ప్రకారం చూస్తే.. ఉచిత కరోనా టీకా హామీ వాటిని ఉల్లంఘించలేదని స్పష్టం చేసింది. సంక్షేమం కోసం ఈ హామీని ప్రణాళికలో చేర్చడం తప్పేమీ కాదని తెలిపింది.
ఇదీ చదవండి:బిహార్ బరి: సీమాంచల్‌లో ఆధిపత్యం ఎవరిది?