మధ్యప్రదేశ్ నివాడీలో నాలుగు రోజుల క్రితం బోరుబావిలో పడిన చిన్నారి మృతి చెందాడు. 90 గంటల పాటు శ్రమించి బాలుడ్ని బయటకు తీసిన సహాయక సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
200 అడుగుల లోతు బావిలో పడిన చిన్నారి మృతితో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.