ముంబయిలో పలు లగ్జరీ హోటళ్లకు బాంబు బెదిరింపు ఈమెయిళ్లు రావడం కలకలం రేపింది. లీలా హోటల్, హోటర్ ప్రిన్సెస్, హోటల్ పార్క్, హోటల్ రమదా ఇన్లకు బాంబు బెదిరింపు మెయిళ్లు వచ్చినట్లు ముంబయి పోలీసులు తెలిపారు.
మెయిల్ పంపిన వ్యక్తి లష్కరేతోయిబా ఉగ్ర సంస్థలో సభ్యుడినని పేర్కొన్నట్లు వెల్లడించారు.
ఈమెయిళ్ల కలకలంతో అప్రమత్తమైన పోలీసులు ఆయా హోటళ్లలో భద్రతను పటిష్ఠం చేసి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. వాటిలో ఎలాంటి అనుమానాస్పద ఆనవాళ్లు దొరకనందున అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయంపై దర్యాప్తు కొనసాగిస్తామని వెల్లడించారు.
ఇదీ చూడండి:ట్రంప్ పర్యటన నేపథ్యంలో దిల్లీలో భారీగా భద్రతా ఏర్పాట్లు