జమ్ముకశ్మీర్లో ఎన్కౌంటర్ జరుగుతోంది. షోపియాన్లోని మెల్హోరాలో ఉగ్రవాదులు- భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు నలుగురు ముష్కరులను భారత సైన్యం మట్టుబెట్టింది.
పక్కా సమాచారంతో...
మెల్హోరాలో ఉగ్రవాదులు దాక్కున్నారన్న కచ్చితమైన సమాచారంతో గత రాత్రి భద్రతా సిబ్బంది ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. వారి రాకను గుర్తించిన ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. జవాన్లు దీటుగా బదులిచ్చి నలుగురిని హతమార్చారు.
ఇదీ చూడండి:- లాక్డౌన్ నుంచి వీటికి మినహాయింపు