రాజస్థాన్ రాజ్సమండ్ జిల్లా దివేర్ ప్రాంతంలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. 8వ నంబరు జాతీయ రహదారిపై ఓ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఘటనలో నలుగురు అక్కడిక్కడే మృతి చెందగా.. మరో 23 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
గుజరాత్ నుంచి జైపూర్ ప్రయాణిస్తున్న వీడియో కోచ్ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన గుంతలో పడిపోయింది. ఈ ప్రమాదంతో కిలోమీటరు మేర రవాణా స్థంభించింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకున్నారు. క్రేన్ సాయంతో బోల్తాపడ్డ బస్సును పక్కకు తీసి.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వీరిలో మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉందన్నారు వైద్యులు.
ఈ ఘటనలో మహిళలు, చిన్నారులు కూడా ఉండటం స్థానికులను కలచివేస్తోంది.
ఇదీ చదవండి:కన్నతల్లి కోసం ఖండాంతరం దాటిన ప్రేమ