ETV Bharat / bharat

జనవరి 26న అయోధ్య మసీదుకు పునాది - The blueprint

అయోధ్యలో మసీదు నిర్మాణానికి గణతంత్ర దినోత్సవం రోజు పునాది వేయనున్నట్లు ఐఐసీఎఫ్​ ట్రస్ట్​ స్పష్టం చేసింది. నమూనాను ఈ శనివారం విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.

Foundation stone for Ayodhya mosque to be laid on R-Day; blueprint this week
గణతంత్ర దినోత్సవం రోజు అయోధ్య మసీదుకు పునాది
author img

By

Published : Dec 17, 2020, 10:37 AM IST

Updated : Dec 17, 2020, 10:53 AM IST

ఉత్తర్​ప్రదేశ్​లోని అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మించే మసీదు నమూనాను ఈ శనివారం(డిసెంబర్​ 19న) విడుదల చేయనున్నట్లు ఇండో-ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ (ఐఐసీఎఫ్) ట్రస్టు ప్రకటించింది. మసీదు నిర్మాణానికి ధన్నీపుర్​లో కేటాయించిన 5 ఎకరాల స్థలంలో.. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన గణతంత్ర దినోత్సవం రోజున శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపింది.

మసీదు నిర్మాణం కోసం.. గతంలో 15 మంది సభ్యులతో ఐఐసీఎఫ్​ ట్రస్ట్​ను ఏర్పాటు చేసింది సున్నీ వక్ఫ్​ బోర్డు. మసీదు ప్రాంగణంలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, ప్రజా గ్రంథాలయం, ఇండో-ఇస్లామిక్ వారసత్వ సంపద కేంద్రాన్ని నిర్మించనున్నట్లు వెల్లడించింది.

ఒకేసారి 2 వేల మంది నమాజ్​..

జామియా మిల్లియా విశ్వవిద్యాలయం ఆర్కిటెక్చర్​ విభాగాధిపతి ఎస్​ఎం అక్తర్.. ఈ మసీదు రూపకర్తగా ఉన్నారు. ఆయన నమూనాను ఖరారు చేశారు. ఒకేసారి 2 వేల మంది నమాజ్​ చేసుకునేలా మసీదును రూపొందించనున్నట్లు అక్తర్​ తెలిపారు. నిర్మాణం వలయాకారంలో ఉంటుందని ఆయన వెల్లడించారు. అయితే.. ఇది బాబ్రీ మసీదు కంటే పెద్దగా ఉంటుందని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: అయోధ్య మసీదు రూపశిల్పిగా ప్రొఫెసర్ అక్తర్​​

అయోధ్యలో రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూమికి సంబంధించి దశాబ్దాల వివాదానికి గతేడాది నవంబర్​ 9న తెరదించింది సుప్రీంకోర్టు. మసీదు నిర్మాణానికి ముస్లింలకు ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించాలని ఆదేశించిన న్యాయస్థానం.. వివాదాస్పద స్థలంలో రామమందిర నిర్మాణానికి ట్రస్ట్​ను ఏర్పాటు చేయాలని అప్పట్లో కేంద్రాన్ని ఆదేశించింది.

ఈ మేరకు 2.77 ఎకరాల స్థలంలో రామమందిర నిర్మాణం ఇప్పటికే ప్రారంభమైంది. మసీదు కోసం.. ధన్నీపుర్​లోని 5 ఎకరాల భూమిని సున్నీ వక్ఫ్​ బోర్డుకు అందించింది యోగి ప్రభుత్వం.

ఇదీ చూడండి: బాబ్రీ మసీదు కేసు.. పూర్తి కథనాలు

Last Updated : Dec 17, 2020, 10:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.