కర్ణాటక గడగ్ జిల్లాకు చెందిన ఓ మాజీ సైనికుడు.. తనకు, తన కుటుంబ సభ్యులకు కారుణ్య మరణాలు(యుథనేషియా) ప్రసాదించాలని కోరుతూ డిప్యూటి కమిషనర్ ద్వారా రాష్ట్రపతిని అభ్యర్థించారు.
గడగ్ జిల్లా లక్ష్మేశ్వర్ గ్రామానికి చెందిన ఎరన్న బీ. అన్నగెరి 17 ఏళ్ల క్రితం సైన్యంలో చేరారు. గత ఏడాది పదవీ విరమణ చేసి సొంత ఇంటికి చేరుకున్నారు. తనలాగే సైన్యంలో చేరాలనుకుంటున్న వారికి శిక్షణ ఇవ్వాలని నిశ్చయించుకున్నాడు. దాని కోసం శిక్షణ కేంద్ర నిర్మాణం చేపట్టారు. దీన్ని జీర్ణించుకోలేని కొంత మంది వ్యక్తులు.. ఉచిత శిక్షణ కేంద్రాన్ని నిర్మించ వద్దంటూ మాజీ సైనికుడిపై రౌడీలతో దాడి చేయించి , కుటుంబ సభ్యులను బెదిరించారు.
"నేను భారత సైన్యంలో 17 ఏళ్ల పాటు సేవ చేసిన తరువాత 2019లో పదవీ విరమణ పొందాను. సైన్యంలో చేరాలనుకునే వారికి శిక్షణ ఇవ్వడానికి ఉచిత శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అనుకున్నాను. నా కలలను నెరవేర్చుకోవటానికి నేను పట్టణంలో స్థలాన్ని కొని ఇల్లు, కేంద్రాన్ని నిర్మించటం ప్రారంభించాను. కానీ కొంతమంది దుండగులు శిక్షణ కేంద్ర నిర్మాణాన్ని ఆపాలంటూ నన్ను, నా కుటుంబాన్ని బెదిరించారు . ఇప్పుడు ఈ రౌడీల వల్ల నా కల సాాకారమయ్యేలా కనిపించటం లేదు. దీంతో నా లక్ష్యాన్ని అందుకోలేక రాష్ట్రపతి అనుమతితో కారుణ్య మరణం పొందాలని నిర్ణయించుకున్నాను."
-ఎరన్న బి.అన్నగెరి, మాజీ సైనికుడు.
అధికారులు మాకు 10 రోజుల్లో న్యాయం చేయాలని .. లేదంటే కారుణ్య మరణాలకు అనుమతి వచ్చే వరకు డిప్యూటి కమిషనర్ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేస్తానని ఎరన్న వెల్లడించారు.
ఇదీ చూడండి బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతం