మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు మంగళవారం అధికారిక లాంఛనాలతో జరగనున్నాయి. ప్రణబ్ భౌతిక దేహాన్ని ఆస్పత్రి నుంచి ఉదయం 9 గంటలకు ఆయన ప్రస్తుతం నివాసమున్న 10-రాజాజీ మార్గ్‌కు తీసుకువెళ్లనున్నారు. అనంతరం ప్రజల సందర్శనార్థం మధ్యాహ్నం 12 గంటల వరకు అక్కడే ప్రణబ్ పార్ధివ దేహాన్ని ఉంచనున్నారు.
అధికారిక ప్రముఖులు ప్రణబ్‌కు నివాళులు అర్పించేందుకు ఉదయం 9:15 నుంచి 10:15 వరకు.. ఇతర ప్రముఖులకు 11 గంటల వరకు సమయం కేటాయించినట్లు రక్షణ శాఖ జారీ చేసిన నోట్లో పేర్కొంది. సాధారణ ప్రజలు ప్రణబ్ ముఖర్జీ భౌతిక కాయాన్ని సందర్శించుకునేందుకు 12 గంటల వరకు అనుమతించనున్నట్లు రక్షణ శాఖ తెలిపింది.
కరోనా ప్రోటోకాల్..
సాధారణ ప్రజల సందర్శన ముగిసిన తర్వాత ప్రణబ్ అంతిమయాత్ర ప్రారంభం కానుంది. కరోనా కారణంగా ఆయన భౌతిక కాయాన్ని గన్ క్యారేజ్‌పై కాకుండా సాధారణ వ్యాన్లోనే శ్మశానవాటికకు తరలించనున్నారు. అంత్యక్రియల్లో కొవిడ్-19 నిబంధనలను కచ్చితంగా పాటించాలని రక్షణ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
ఇవీ చూడండి:
ప్రణబ్ మృతిపట్ల ప్రపంచ దేశాల సంతాపం
ప్రమాణస్వీకారం చూడటానికి వెళ్లి.. మంత్రిగా బయటకు..