ETV Bharat / bharat

ఆంగ్లంలో రెండు డిగ్రీలు- ప్రస్తుతం యాచకురాలు! - ఉత్తరాఖండ్ యాచకురాలి కథ

ఆమె ఓ విద్యాకుసుమం. ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడగలిగే ఆమె ప్రస్తుతం ఉత్తరాఖండ్​లోని హరిద్వార్​లో యాచకురాలిగా జీవనం సాగిస్తున్నారు. రెండుసార్లు ఆంగ్లంలో పట్టభద్రురాలైన హన్సీ.. వైవాహిక జీవితంలో తలెత్తిన వివాదాల కారణంగా తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

HARIDWAR HANSI PRAHARI
హన్సీ
author img

By

Published : Oct 19, 2020, 7:25 AM IST

Updated : Oct 19, 2020, 2:14 PM IST

ఉత్తరాఖండ్​ హరిద్వార్​కు చెందిన హన్సీ ప్రహారి.. భిక్షమెత్తుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గతంలో హన్సీ ఓ విద్యాకుసుమం. ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడగలరు. ఉత్తరాఖండ్​లోని కుమావూ విశ్వవిద్యాలయంలో రెండుసార్లు ఆంగ్లంలో పట్టభద్రురాలు అయ్యారు.

హన్సీ ప్రహారి అక్కడే విద్యార్థి నాయకురాలిగా ఎదిగారు. అక్కడి గ్రంథాలయంలో ఉద్యోగం చేస్తుండేవారు. ఆమె గతంలో కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత ఎంపీ అజయ్ టమ్​టాకు వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ చేశారు.

యాచకురాలిగా..

HARIDWAR HANSI PRAHARI
ప్రభుత్వానికి అర్జి
HARIDWAR HANSI PRAHARI
హన్సీ ధ్రువపత్రం

వైవాహిక జీవితంలో తలెత్తిన వివాదాల కారణంగా తీవ్ర విషాదంలో మునిగిపోయారు హన్సీ. ప్రస్తుతం హరిద్వార్​లోని రైల్వే స్టేషన్, బస్టాండు, గంగా తీరంలోని ఘాట్​లలో భిక్షమెత్తుకుంటున్నారు. ఆమెకు ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు.

కుమారుడు ఆమెతోనే వీధుల వెంట జీవిస్తున్నాడు. ఆమెకు తెలిసిన విద్యను కుమారుడికి నేర్పిస్తున్నారు. తనను ఆదుకోవాలని ప్రభుత్వానికి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశారు. తాను మామూలు స్థితికి వస్తే తన కుమారుడిని బాగా చదివించాలని అనుకుంటున్నట్లు తెలిపారు హన్సీ.

ఇదీ చూడండి: ఈ గ్రామంలోని ఇళ్లు కూతుళ్లకు అంకితం!

Last Updated : Oct 19, 2020, 2:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.