పశ్చిమ్ బంగా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే తన కేబినెట్ మంత్రి పదవికి రాజీనామా చేసిన రాజీవ్ బెనర్జీ.. ఎమ్మెల్యే పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో ఆయన భాజపాలో చేరతారనే ఊహగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి.
దీదీ కేబినెట్లో రాష్ట్ర అటవీ శాఖ మంత్రిగా వ్యవహరించిన రాజీవ్ బెనర్జీ.. కొన్ని రోజుల క్రితం ఆ పదవికి రాజీనామా చేశారు. రాష్ట్ర ప్రజలకు సేవ చేయడం తనకు దక్కిన గొప్ప గౌరవమని, ఈ అవకాశం ఇచ్చినందుకు మమతకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
ఇదీ చూడండి: 'రైతులపై దాడితో దేశం బలహీనం'