ETV Bharat / bharat

పాక్​ కుట్రలను ప్రపంచానికి చెప్పిన భారత్ - పాక్​ కుట్రలను ప్రపంచానికి చెప్పిన భారత్

ఇటీవల కశ్మీర్​లో జరిగిన నగ్రోటా ఘటనను ప్రపంచ దేశాల దృష్టికి తీసుకెళ్లింది భారత్​. ఉగ్రవాద సంస్థలకు పాకిస్థాన్‌ మద్దతుగా నిలుస్తోందని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని ఐదు శాశ్వత సభ్యదేశాలకు భారత్‌ తెలిపింది.

Foreign Secretary briefs envoys of key nations on attempts by Pak-based JeM to carry out terror attack in J&K
పాక్​ కుట్రలను ప్రపంచానికి చెప్పిన భారత్
author img

By

Published : Nov 23, 2020, 9:08 PM IST

నగ్రోటా ఘటన వ్యవహారంపై.. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని ఐదు శాశ్వత సభ్యదేశాలకు భారత్‌ సమాచారం ఇచ్చింది. పాకిస్థాన్ కేంద్రంగా భారత్‌లో జరుగుతున్న ఉగ్ర కుట్రలను అంతర్జాతీయ వేదికపైకి తీసుకెళ్లింది.

సరిహద్దు ఉగ్రవాదంపై పీ-5 దేశాలకు భారత్​ సమాచారం ఇచ్చింది. పాకిస్థాన్.. ఉగ్రవాద సంస్థలకు మద్దతుగా నిలుస్తోందని తెలిపింది. అమెరికా, రష్యా, చైనా, ఇంగ్లండ్, ఫ్రాన్స్ దేశాలకు ఈ మేరకు విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్​ ష్రింగ్లా వివరించారు. ముంబయిపై ఉగ్రదాడి తరహా దాడులకు ప్రణాళిక రచించిన పాకిస్థాన్‌కు చెందిన నలుగురు జైషే మహ్మద్​ ఉగ్రవాదులను జమ్ముకశ్మీర్‌లోని నగ్రోటాలో భద్రతా బలగాలు హతమార్చాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.