ETV Bharat / bharat

'తబ్లీగీ'కి వచ్చిన విదేశీయుల నిషేధంపై సుప్రీంలో పిటిషన్లు - Tablighi Jamaat latest news

సుమారు 35 దేశాలకు చెందిన 3,500మందికిపైగా విదేశీయులు భారత్​లోకి రాకుండా నిషేధం విధించటంపై సుప్రీం కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. విదేశీయులకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంతో ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు పిటిషనర్లు.

Foreign nationals
తబ్లిగీ జమాతే విదేశీయుల నిషేధంపై సుప్రీంలో పిటిషన్లు
author img

By

Published : Jun 22, 2020, 10:03 AM IST

తబ్లీగీ జమాతే కార్యకలాపాల్లో భాగస్వామ్యమైన 3,500 మందికిపైగా విదేశీయులను 10 ఏళ్లపాటు భారత్​లోకి రాకుండా నిషేధించటాన్ని వ్యతిరేకిస్తూ పలువురు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ ఆదేశాలను కొట్టివేయాలని కోరారు.

మొదటగా 960 మందిపై నిషేధం విధిస్తూ ఏప్రిల్​ 2 ఆదేశాలు ఇచ్చింది కేంద్రం. ఆ తర్వాత మరో 2,500 మందికిపైగా నిషేధిస్తూ జూన్​ 4న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రెండు ఆదేశాలను సవాల్​ చేస్తూ న్యాయవాది ఫుజైల్​ అహ్మద్​ ఆయూబీ ద్వారా నాలుగు రాతపూర్వక వ్యాజ్యాలు దాఖలు చేశారు ప్రస్తుతం భారత్​లో ఉన్న విదేశీయులు.

"అది ఏకపక్ష నిర్ణయం. ముఖ్యంగా నిషేధానికి గురైన విదేశీయుల మాట వినికుండా.. మొదటి తప్పుగా భావించి అవకాశం ఇవ్వటం.. నోటీసులు ఇవ్వటం వంటివి చేయకుండా తీసుకున్న నిర్ణయం సహజ న్యాయ సూత్రాలను ఉల్లంఘిస్తోంది. భారత్​లో ఉన్నవారు తమను తాము రక్షించుకోవడానికి ఎటువంటి అవకాశం ఇవ్వకపోవటం రాజ్యాంగంలోని ఆర్టికల్​ 21 ఉల్లంఘనే అవుతుంది. "

- థాయ్​లాండ్​ మహిళ, పిటిషనర్​

కేంద్ర హోంశాఖ ఏకపక్షంగా బాధిత విదేశీ పౌరులపై పెద్ద సంఖ్యలో నిషేధం విధించిందని పేర్కొన్నారు పిటిషనర్లు. దాంతో నిషేధానికి గురైన వ్యక్తులు బలవంతంగా భారత్​లోనే ఉండిపోవాల్సి వచ్చిందని తెలిపారు.

ఇదీ చూడండి: జాగ్తే రహో: ఆశ చూపించి డబ్బులు కొట్టేస్తారు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.