ETV Bharat / bharat

స్వీయ నిర్బంధంలో ఏం తినాలి? ఏం తినకూడదు?

author img

By

Published : Mar 25, 2020, 11:10 AM IST

Updated : Mar 25, 2020, 1:59 PM IST

అసలే వైరస్​ కాలం. ఆరోగ్యం పట్ల ఏ మాత్రం అశ్రద్ధ వహించినా.. ఆసుపత్రికి పరుగెత్తాల్సిన పరిస్థితి. మరి ఈ సమయంలో మన ఆరోగ్యానికి ఎలాంటి ఆహారం అవసరం? ఏ ఆహారం తీసుకుంటే వాటి ప్రయోజనాలు ఎలా ఉంటాయో వివరించారు పోషకాహార నిపుణురాలు సుజాత స్టీఫెన్‌. ఆ వివరాలు మీకోసం..

Food Tips for Good Health
స్వీయ నిర్బంధంలో... ఏం తినాలి.. ఏం తినకూడదు..

అసలే వైరస్‌ కాలం. దగ్గు, జ్వరం, జలుబు వస్తే.. తొలుత కరోనాగా అనుమానించాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో చాలామంది ఆసుపత్రలకు పరుగులు తీస్తున్నారు. అక్కడి వైద్యుల సూచనల మేరకు 14 రోజులపాటు ఇంటి వద్దే స్వీయ నిర్బంధం (హోం క్వారంటైన్‌)లో ఉంటున్నారు. బయట తిరగడం వల్ల ఇతరులకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో చాలామందిని ఇంటికే పరిమితం చేస్తున్నారు. అప్పటికీ లక్షణాలు తగ్గకపోతే మళ్లీ ఆసుపత్రికి రావాలని సూచిస్తున్నారు. స్వీయ నిర్బంధంలో ఉన్నవారు తీసుకునే ఆహారం, పాటించే ఇతరత్రా జాగ్రత్తలూ వారు త్వరితగతిన కోలుకోవడానికి దోహదం చేస్తాయి. ప్రధానంగా సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులు నమ్మకుండా.. సమతుల ఆహారం తీసుకోవడం, తగినంత సమయం నిద్ర పోవడం, ఇంట్లోనే కొంతసేపు వ్యాయామం చేసుకోవడం ద్వారా అనారోగ్యం నుంచి త్వరితగతిన కోలుకోవచ్చునని పోషకాహార నిపుణురాలు సుజాత స్టీఫెన్‌ పేర్కొన్నారు.

వ్యాధి నిరోధక శక్తి పెంచుకోండి..

Food Tips for Good Health in Self Quarantine time: Sujatha Stephen
వ్యాధి నిరోధక శక్తి పెంచుకోండి

సమతుల్యం అంటే.. విటమిన్‌ ఎ, బి, సి, డి, ఐరన్‌, సెలినీయం, జింక్‌ ఉండే ఆహారాన్ని సమపాళ్లలో తీసుకోవాలి. ఇందులో ఉండే సూక్ష్మ పోషకాలు వైరల్‌, బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌లతో పోరాడుతాయి. శరీరానికి తగినంత రోగ నిరోధక శక్తిని అందిస్తాయి. ఒంట్లో ఈ శక్తి తగ్గినప్పుడు బయట నుంచి ఇవి దాడి చేసి అనారోగ్యానికి కారణమవుతాయి. మంచి ఆహారం, ఆరోగ్యం అనేది ప్రతి ఒక్కరు తూ.చ. తప్పకుండా అనుసరించడం చాలా ముఖ్యమని సుజాత వివరించారు. ఈ క్రమంలో ఏవి తినాలి.. ఎలాంటి ఆహారానికి దూరంగా ఉండాలనేది చాలా ముఖ్యం. సమతుల ఆహారానికి బదులు.. జంక్‌ఫుడ్‌, కోలాలు, అధిక చక్కెర ఉన్న పదార్థాలు, ఆల్కహాల్‌ వంటివి తీసుకుంటే ఇవి శరీరంలోని వ్యాధి నిరోధక శక్తిని అడ్డుకుంటాయి. తద్వారా వైరస్‌లు శ్వాసకోశ వ్యవస్థపై దాడి చేసే అవకాశాం ఉంది. ఈ నేపథ్యంలో పొగ తాగడం అలవాటు ఉన్న వారు తక్షణం మానుకోవడం మంచిది. లేదంటే ఊపిరితిత్తులు పోరాడే సామర్థ్యాన్ని కోల్పోతాయి.

ఇంటి నుంచి పని చేసేవారు ఇలా..

ముఖ్యంగా కరోనా ప్రభావంతో చాలామంది ఇంటి నుంచే పనిచేస్తున్నారు. ఇలాంటి వారు తిండిపై కాస్త అశ్రద్ధ చూపే అవకాశం ఉంది. సమయానికి భోజనం చేయకుండా నిర్లక్ష్యం చేస్తుంటారు. లేదంటే ఎక్కువ మోతాదులో తీసుకుంటారు. తద్వారా జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. కచ్చితంగా భోజనంలో సమయం పాటించాలి. వీటితోపాటు ఆల్కహాల్‌, ధూమపానానికి దూరంగా ఉండాలి. ఇంట్లోనే తేలిక పాటి వ్యాయామాలు గంటపాటు చేయాలి. యోగ, ధ్యానం చేయడం వల్ల మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజులు ఎంతో మేలు చేస్తాయి. సామాజిక మాధ్యమాల్లో వచ్చే తప్పుడు సమాచారం నమ్మడం మంచిది కాదు.

ఎందులో.. ఏమున్నాయంటే..

విటమిన్‌ ఎ: వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. కోడిగుడ్డులోని పచ్చ సొన, బాదం, పిస్తా, తృణధాన్యాలు, ఆకు కూరలు,క్యారెట్లలో ఉంటుంది.

ఆకు కూరలు

విటమిన్‌ బి: బీ6, బి9, బి12 చాలా అవసరం. ఇవి శరీరంలోని వైరల్‌,బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లపై సమర్థంగా పోరాడతాయి. చికెన్‌, చేపలు, గుడ్లు, మటన్‌, బాదం, శనగలు, బొబ్బర్లు, బీన్స్‌, పాలలో పుష్కలంగా ఉంటాయి.

విటమిన్‌ బి

విటమిన్‌ సి: శరీరంలో హానికారక టాక్సిన్లను నిరోధిస్తుంది. కణాలను శుద్ధి చేస్తుంది. వ్యాధి నిరోధక శక్తి పెంచడంలో కీలక భూమిక పోషిస్తుంది. నిమ్మ, ఆరెంజ్‌, చెర్రీలు, కివీ, టమోటాల్లో అధికంగా ఉంటుంది.

విటమిన్‌ సి

విటమిన్‌ ఇ: కణశుద్ధిలో తోడ్పడుతుంది. పిస్తా, అక్రోట్‌, వెజిటబుల్‌ ఆయిల్స్‌లో ఎక్కువగా ఉంటుంది.

విటమిన్‌ ఇ

విటమిన్‌ డి: శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. సూర్యరశ్మిలో ఎక్కువగా ఉంటుంది. చేపలు, గుడ్డు, పాలల్లో లభిస్తుంది.

విటమిన్‌ డి

జింకు: శరీరం, పేగులను తేమతోఉంచుతుంది. యాంటి ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. వైరల్‌ ఇన్‌ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది.సముద్ర ఉత్పత్తులు, నట్స్‌, చికెన్‌లో లభిస్తుంది.

జింకు

ఎప్పుడు.. ఎలాంటి ఆహారమంటే...

అల్పాహారం: గుడ్డు, తృణ ధాన్యాలతో తయారు చేసిన ఇడ్లీ, దోశ, ఉప్మా ఏదైనా తీసుకోవాలి. 50-80 గ్రాములు మొలకలు.. అనంతరం చిన్న కప్పు పాలు తప్పనిసరి.

అల్పాహారం

ఉదయం పదిన్నరకు: ఏదైనా ఒక పండు, గ్లాసుడు మజ్జిగ, నిమ్మకాయ నీళ్లు, పండ్ల రసం...వీటిలో ఏదైనా తీసుకోవచ్చు. పండు తప్పనిసరి.

ఉదయం పదిన్నరకు

మధ్యాహ్న భోజనం: బ్రౌన్‌ రైస్‌ 200 గ్రాములు, కూరగాయలు 200 గ్రా.(రెండు కప్పులు), ఆకు కూర పప్పు, శనగలు లేదా అలసందలు ఒక చిన్న కప్పు, 100 గ్రా. చికెన్‌, చివరిలో పెరుగు లేదా మజ్జిగ తీసుకోవాలి.

మధ్యాహ్న భోజనం

మధ్యాహ్నం మూడున్నరకు: గుప్పెడు గింజలతో పాటు కాఫీ టీ, పాలు వీటిలో ఏదో ఒకటి.

మధ్యాహ్నం మూడున్నరకు

రాత్రికి డిన్నర్‌

రాత్రికి డిన్నర్‌: 7.30-8.30 మధ్య డిన్నర్‌ పూర్తి చేయాలి. గోధుమ లేదా జొన్న పిండితో రొట్టెలు, కప్పుడు మిక్స్‌డ్‌ వెజిటబుల్‌ కూర చివరలో పెరుగు లేదా మజ్జిగ తీసుకోవాలి. పడుకునే ముందు కప్పు పాలలో చిటికెడు పసుపు వేసుకొని తాగితే మంచిగా నిద్ర పడుతుంది.

ఇదీ చదవండి: బరువు అదుపులో ఉండాలంటే ఉదయం ఎక్కువ తినాల్సిందే!

Last Updated : Mar 25, 2020, 1:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.