ETV Bharat / bharat

లాలూ బెయిల్​​పై నోటీసులు - లాలూ ప్రసాద్​ యాదవ్

లాలూ ప్రసాద్​ యాదవ్​ బెయిల్​ పిటిషన్​పై రెండు వారాల్లో స్పందించాలని కేంద్ర దర్యాప్తు సంస్థకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. పశుగ్రాసం కుంభకోణానికి సంబంధించిన కేసుల్లో బెయిల్​ మంజూరుకు సుప్రీంను ఆశ్రయించారు లాలూ.

లాలూ బెయిల్​​పై నోటీసులు
author img

By

Published : Mar 15, 2019, 1:33 PM IST

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్​ యాదవ్​ బెయిల్​ పిటిషన్​పై కేంద్ర దర్యాప్తు సంస్థకు నోటీసులు జారీ చేసింది సుప్రీం కోర్టు. రెండు వారాల్లోపు స్పందించాలని ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం బెయిల్​ పిటిషన్​పై విచారణ చేపట్టింది.

పశుగ్రాసం కుంభకోణానికి సంబంధించిన మూడు కేసుల్లో లాలూ బెయిల్​ మంజూరు పిటిషన్​ను జనవరి 10న ఝార్ఖండ్​ హైకోర్టు తిరస్కరించింది. దీనిని సవాలు చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు లాలూ. ప్రస్తుతం ఝార్ఖండ్​ రాంచీలోని బిర్సా ముండా కేంద్ర కారాగారంలో లాలూ ఉన్నారు.

బిహార్​ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో లాలూ ప్రసాద్​ అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలున్నాయి. పశుసంవర్ధక శాఖ ఖజానా నుంచి మోసపూరితంగా ఆయన సుమారు రూ.900 కోట్లు దోచుకున్నారని అభియోగాలున్నాయి.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.