విమానాల్లో ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చని.. వాటిపై ఎటువంటి నిషేధమూ లేదని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) స్పష్టం చేసింది. అయితే, విమానంలో గందరగోళం సృష్టించి, విమాన కార్యకలాపాల్లో అంతరాయం కలిగించేలా రికార్డింగ్ చేయకూడదని సూచించింది. అది భద్రతా ప్రమాణాల ఉల్లంఘన కిందికే వస్తుందని, వాటిని విమాన సిబ్బంది నిషేధిస్తారని డీజీసీఏ పేర్కొంది.
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ముంబయికి వస్తోన్న క్రమంలో కరోనా నిబంధనలు గాలికి వదిలేసి విమానంలో మీడియా ప్రతినిధులు అత్యుత్సాహం చూపించారు. ఆ వ్యవహారంపై ఆగ్రహం చెందిన విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ శనివారం విమానయాన సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా విమానంలో ఎవరైనా ఫొటోలు తీసినట్లు కనిపిస్తే రెండు వారాల పాటు ఆ విమాన సేవలను నిలిపివేస్తామని హెచ్చరించింది.
ఇదీ చూడండి కరోనాను జయించినవారికి ఆరోగ్యశాఖ కీలక సూచనలు