ETV Bharat / bharat

రాహుల్​పై 'పచ్చ లైటు'- కాంగ్రెస్​ కలవరం

author img

By

Published : Apr 11, 2019, 5:03 PM IST

Updated : Apr 11, 2019, 6:44 PM IST

కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ భద్రతపై పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. అమేఠీ లోక్​సభ స్థానానికి నామినేషన్ వేశాక రాహుల్​ ముఖంపై పాయింట్​ బ్లాంక్​లో లేజర్లు పడ్డాయంటూ కేంద్రహోంశాఖకు లేఖ రాశారు. భద్రత పెంచాలని కోరారు.

'రాహుల్​ ప్రాణాలకు ముప్పు.. భద్రత పెంచండి'
రాహుల్​పై 'పచ్చ లైటు'- కాంగ్రెస్​ కలవరం

కేంద్ర హోంమంత్రి రాజ్​నాథ్​ సింగ్​కు కాంగ్రెస్ పార్టీ లేఖ రాసింది. తమ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందంటూ సదరు లేఖలో పేర్కొంది.

"ఇద్దరు ప్రధానులను దేశం తీవ్రవాదుల దాడి వల్ల కోల్పోయింది. ఆ ఇద్దరు గాంధీ కుటుంబానికి చెందినవారే. ప్రస్తుత కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీపైనా అలాంటి దాడి జరుగుతుందనే అనుమానం ఉంది. అమేఠీ లోక్​సభ స్థానానికి నామపత్రం దాఖలు చేశాక రాహుల్ విలేకరులతో మాట్లాడారు.

ఆ సమయంలో స్వల్ప వ్యవధిలో ఆయన ముఖం కుడి భాగంపై 7 సార్లు లేజర్ వెలుగు పడినట్లు గుర్తించాం. మాజీ భద్రతా నిపుణులు, అధికారులను సంప్రదించాక ఆ లేజర్​ ఓ శక్తిమంతమైన స్నైపర్​ తుపాకీ లాంటి ఆయుధం నుంచి వచ్చినట్లు ప్రాథమిక నిర్ధరణకొచ్చాం. ఇది తీవ్ర ఆందోళన కలిగించే అంశం. దీనిపై హోంమంత్రిత్వ శాఖ దర్యాప్తు చేయాలి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్​ గాంధీకి పూర్తి స్థాయి భద్రత ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం."

- కాంగ్రెస్ లేఖ సారాంశం

ఈ మేరకు కాంగ్రెస్​ నాయకులు అహ్మద్​ పటేల్, జైరాం రమేశ్, రణ్​దీప్​ సుర్జేవాలా సంతకాలతో హాంమంత్రిత్వ శాఖకు లేఖ అందించింది కాంగ్రెస్.

అది కెమెరా వెలుగు...!

ఈ విషయంపై హోంమత్రిత్వ శాఖకు ప్రత్యేక భద్రత దళం-ఎస్​పీజీ డైరెక్టర్​ సమాచారమిచ్చారు. కాంగ్రెస్​ పార్టీ పేర్కొంటున్న వీడియోలోని 'గ్రీన్​ లైట్' ఏఐసీసీ ఫొటోగ్రాఫర్​ చరవాణి నుంచి వచ్చిందని తెలియజేశారు. అమేఠీ కలెక్టరేట్​ వద్ద రాహుల్​ గాంధీ విలేకరులతో మాట్లాడుతున్నప్పుడు ఇది జరిగిందని వివరించారు. రాహుల్​ గాంధీ ప్రాణానికి ఎలాంటి ముప్పు లేదని స్పష్టం చేశారు ప్రత్యేక భద్రత దళం డైరక్టర్​.

ఇదీ చూడండి: విజయం కోసం కాంగ్రెస్​ అడ్డదారులు: మోదీ

Tokyo (Japan), Apr 11 (ANI): Cotoha is an Artificial Intelligence-assisted communication engine uniquely developed by NTT Communications. Recently, the company introduces its latest series, Cotoha Meeting Assist. This new service provides comprehensive business meeting tools with its finest natural language processing function. COTOHA uses its own Japanese language database with over two-million words which is collected by the company for over four decades to help achieve its precision. Behind this development, there is work-style reform, a nationwide movement to promote dynamic engagement of all citizens to solve the problem of shrinking labor force and ageing society. Given such conditions, operational reform by latest technology may be able to help the situation by boosting productivity and efficiency. This is the demonstration of Cotoha Meeting Assist. First, the voice recognition system instantly converts live speech into text data. And in no time, it translates to a targeted language with high accuracy. In this way, conversations between different languages can run quite efficiently. With use of Cotoha Meeting Assist, members can join the meeting remotely via text chat from any computer or smart phone. Further involvement of cutting-edge technology in workplace may hold an important key for the future of the society.
Last Updated : Apr 11, 2019, 6:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.