ETV Bharat / bharat

సహాయక చర్యలకు 90 ఎన్​డీఆర్​ఎఫ్​ బృందాలు - ఎన్​డీఆర్​ఎఫ్​

దేశవ్యాప్తంగా 90 బృందాలను మోహరించింది ఎన్​డీఆర్​ఎఫ్​. వరదల్లో సహాయక చర్యల కోసం ఈ బృందాలు పనిచేయనున్నాయి. దేశంలో కరోనా వైరస్​ విజృంభిస్తోన్న నేపథ్యంలో.. ప్రజలు, సామగ్రిని శానిటైజ్​ చేయడంపై ఈ బృందాలు దృష్టిపెట్టనున్నాయి.

Floods: NDRF positions 90 teams, new drills to tackle COVID-19
ఆ పని కోసం దేశవ్యాప్తంగా 90 ఎన్​డీఆర్​ఎఫ్​ బృందాలు
author img

By

Published : Jul 4, 2020, 5:22 PM IST

వర్షాకాలం నేపథ్యంలో ఎన్​డీఆర్​ఎఫ్​ అప్రమత్తమైంది. కరోనా వైరస్​ విజృంభిస్తోన్న తరుణంలో వరదల వంటి విపత్తు పరిస్థితుల్లో సహాయక చర్యలు, ప్రజలు, సామగ్రిని శానిటైజ్​ చేయడం కోసం 90కి పైగా బృందాలను దేశవ్యాప్తంగా మోహరించింది.

వర్షాకాలం నేపథ్యంలో వరదల సన్నద్ధతపై ఎన్​డీఆర్​ఎఫ్​ అధికారులతో శుక్రవారం సమావేశమయ్యారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. విపత్తు పరిస్థితులను ఎదుర్కొనేందుకు పక్కా ప్రణాళికను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా 90 బృందాలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు ఎన్​డీఆర్​ఎఫ్ డైరెక్టర్​ జనరల్​ ఎస్​ ఎన్​ ప్రధాన్​​.

ఒక్కో బృందంలో 45 మంది సభ్యులు ఉంటారు. బోట్లు, ఇతర పరికరాలతో సహాయం చేయడానికి ఈ బృందాలు సన్నద్ధంగా ఉంటాయి.

కరోనా వైరస్​ విజృంభణ నేపథ్యంలో ప్రత్యేక వ్యూహాలతో సన్నద్ధమవుతున్నట్టు ప్రధాన్​ తెలిపారు.

"కరోన వైరస్​ నేపథ్యంలో నివారణ, రక్షణాత్మక చర్యలు ముమ్మరం చేశాం. ప్రజలు, సామగ్రిని శానిటైజ్​ చేయడంపై దృష్టిపెట్టాం. ఈ మేరకు విపత్తు పరిస్థితులను ఎదుర్కొనేందుకు దేశవ్యాప్తంగా 90 బృందాలను మోహరించాం. అయితే భౌతిక దూరం, శానిటైజేషన్ వంటి నిబంధనలను పాటించేందుకు వీలుగా ఈ​ బృందాలకు వసతులు కల్పించాలని రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులు, స్పెషల్​ రిలీఫ్​ కమిషనర్లకు లేఖ రాశాం. ఈ బృందాలను పర్యవేక్షించడానికి కంట్రోల్​ రూమ్​ను ఏర్పాటు చేస్తాం."

--- ఎస్​ ఎన్​ ప్రధాన్​, ఎన్​డీఆర్​ఎఫ్​ డైరక్టర్​ జనరల్​

గత నెలలో ఒడిశా, బంగాల్​లో అంపన్​ తుపాను​ బీభత్సం సృష్టించింది. బంగాల్​లో సహాయక చర్యల్లో పాల్గొన్న ఎన్​డీఆర్​ఎఫ్​ సిబ్బందిలోని 60 మందికి వైరస్​ సోకింది. అయితే ఇప్పుడు దాదాపు అందరి ఆరోగ్యం మెరుగుపడింది.

ఇదీ చూడండి:- మాస్కే బంగారమాయెనే..! ధరెంతో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.