రాజస్థాన్ డుంగర్పుర్లో భారీ వర్షాలకు రోడ్లన్నీ నదులుగా మారాయి. వరద ప్రవాహానికి వాహనాలన్నీ ఎక్కడికక్కడే స్థంభించిపోయాయి. డుంగర్పుర్, ఉదయపుర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఈ పరిస్థితుల్లో దాదాపు 15 మంది బడి పిల్లలు, కళాశాల విద్యార్థులు ప్రయాణిస్తున్న ఓ ట్రక్ పెను ప్రమాదం నుంచి బయటపడింది.
బడిపిల్లలకు వలవేసిన వరదలు
శనివారం వరదల కారణంగా గంటలు గడుస్తున్నా వాహనాలు ముందుకు కదలడం లేదు. ట్రక్‌లోని చిన్నారులు వర్షానికి తడిసిపోతున్నారు. విద్యార్థులను త్వరగా ఇంటికి చేర్చాలన్న ఆలోచనతో ట్రక్ డ్రైవర్ వరదలోనే వాహనాన్ని ముందుకు నడిపాడు. అదుపుతప్పి ట్రక్ కుంటలోకి దిగిపోయింది.
కాపాడేందుకు ఏకం...
తీవ్ర భయాందోళనకు గురైన చిన్నారులు కాపాడమంటూ గట్టిగా అరిచారు. స్థానికులు, వాహనదారులు చలించిపోయారు. వర్షాన్ని, వరదను లెక్క చేయక ట్రక్కు తాడు కట్టి విద్యార్థులను బయటకు రప్పించారు.
ఇక్కడా.. ఇదే పరిస్థితి
భారీ వర్షాల కారణంగా ఇదే జిల్లాలోని కాన్ల్రా చెరువులోఓ యువకుడు కొట్టుకుపోయాడు. బోడిగామ్ బడా గ్రామంలోని ఇళ్లన్నీ జలమయం అయ్యాయి. ఘావడీ పులియే వద్ద 10 అడుగుల మేర నిలిచిపోయిన నీటిలో అనేక వాహనాలు చిక్కుకున్నాయి. రాష్ట్ర విపత్తు స్పందన దళం(ఎస్డీఆర్ఎఫ్డీ) రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది.
ఇదీ చూడండి: 'ఆ రోజు రాత్రి ఒక్క క్షణం కూడా నిద్ర పోలేదు'