ఉత్తర్ప్రదేశ్ రాంపుర్లోని ఫ్లిప్కార్ట్ గిడ్డంగిలో లూఠీ జరిగింది. తుపాకులు పట్టుకొని వచ్చిన ఐదుగురు దుండగులు లక్షల నగదును దోచుకెళ్లారు. శనివారం రాత్రి 10 గంటలకు ఈ ఘటన జరిగింది.
గిడ్డంగిలోని ఉద్యోగులు నగదును లెక్కిస్తున్న సమయంలో దుండగులు లోపలికి చొరబడ్డారు. తుపాకులు చూపిస్తూ నగదు ఉన్న డబ్బాను అమాంతం ఎత్తుకెళ్లారు. ఈ తతంగం అంతా 18 సెకన్లలోనే జరిగిపోయింది. చోరీ మొత్తం సీసీటీవీ కెమెరాల్లో నమోదైంది.
ఈ ఘటనపై పోలీసులకు సమాచారమిచ్చినట్లు గిడ్డంగి ఇంఛార్జి అన్మోల్ కశ్యప్ తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. అయితే ఎంత నగదు దోచుకెళ్లారనేది విచారణలో తేలాల్సి ఉందని ఎస్పీ షాగన్ గౌతమ్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: రాష్ట్రాలకు అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మోదీ