మహమ్మారి కరోనా కారణంగా ఎక్కడి కార్యకలాపాలు అక్కడే నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే ఫ్రాన్స్ నుంచి మే తొలివారంలో భారత్‌కు రావాల్సిన రఫేల్ యుద్ధ విమానాలు.. 11 వారాలు ఆలస్యంగా అమ్ములపొదిలో చేరనున్నాయి. 36 విహంగాల్లో తొలి నాలుగు.. జూలై చివరి వారంలో భారత్‌కు చేరతాయని అధికారులు వెల్లడించారు.
శిక్షణ పూర్తి..
యుద్ధ విమానాలను స్వాగతించడానికి ఇప్పటికి అవసరమైన మౌలిక సదుపాయాలను సిద్ధం చేసినట్లు భారత వాయుసేన(ఐఏఎఫ్) తెలిపింది. పైలట్లకు శిక్షణ కూడా పూర్తయినట్లు స్పష్టం చేసింది.
వ్యూహాత్మక స్థావరాల్లో..
తొలి వైమానిక దళ బృందాన్ని అంబాలా విమానాశ్రయంలో ఉంచనున్నట్లు సమాచారం. దీనిని అత్యంత వ్యూహాత్మక స్థావరాలలో ఒకటిగా భావిస్తారు. అక్కడ నుంచి పాక్ సరిహద్దుకు 220 కిలోమీటర్ల దూరమే ఉండటం కారణం.
2016లోనే ఒప్పందం..
రూ.58,000 కోట్ల వ్యయంతో 36 రఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయడానికి 2016 సెప్టెంబరులో ఫ్రాన్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది భారత్. 36 రఫేల్ విమానాల్లో 30 యుద్ధ విమానాలు కాగా... 6 శిక్షణ విమానాలు. ఇవి అత్యంత శక్తిమంతమైన ఆయుధాలను మోయగలవు.
ఇదీ చూడండి: రిక్షా బాలుడు: తల్లీదండ్రుల భారాన్ని.. వందల కి.మీ మోస్తూ..