ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటీవలే.. తక్షణ ముమ్మారు తలాక్‌ను నిషేధిస్తూ చట్టాన్ని రూపొందించింది. ఇది అమల్లోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే దిల్లీలో తొలికేసు నమోదైంది. జూన్ 23న ఓ వ్యక్తి తన భార్యకు వెంటవెంటనే 3 సార్లు తలాక్ పలకడంతో పాటు, వాట్సాప్‌లో ఫత్వా పంపించాడు. సదరు మహిళ దిల్లీలోని నిబారా హిందూరావ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై ముస్లిం మహిళల వివాహ రక్షణ చట్టం 2019 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు పోలీసులు వెల్లడించారు.
కట్నం కోసం తలాక్
2011లో వారిద్దరికీ వివాహం జరిగింది. భర్త, అతని కుటుంబం.. తనను వరకట్నం కోసం వేధించేవారని... అలా చివరకు ముమ్మారు తలాక్ చెప్పి తన ఆరేళ్ల కొడుకుతో సహా బయటకు గెంటేశారని ఆరోపించింది బాధితురాలు.