తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద కాల్పుల జరిగినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రాంతంలో భారత్-చైనా దళాలు మూడు నెలలుగా స్టాండ్-ఆఫ్‌లో ఉన్నాయి.
పాంగాంగ్ సరస్సు దక్షిణ తీరాన ఉన్న వ్యూహాత్మక ఎత్తును భారత్ ఇటీవల చేజిక్కించుకుంది. దీనితో పాంగాంగ్ దక్షిణ తీరంలోకి అక్రమంగా ప్రవేశించేందుకు చైనా ఇటీవల చేసిన ప్రయత్నాన్ని భారత్ సమర్థవంతంగా అడ్డుకోగలిగింది. ఈ ఘటన తర్వాత కాల్పులు జరిగినట్లు వార్తలు వస్తుండటం గమనార్హం.
పాంగాంగ్ సరస్సు దక్షిణ ప్రాంతంలో భారత బలగాలు.. వాస్తవాధీన రేఖను దాటాయని చైనా ఆరోపిస్తోంది. ఈ మేరకు చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్ నివేదించింది.
దిగజారిన పరిస్థితులు..
ఫింగర్ ప్రాంతాలు, గల్వాన్ లోయ, హాట్ స్ప్రింగ్ సహా పలు ప్రాంతాల్లో చైనా సైన్యాన్ని మోహరించడం వల్ల ఏప్రిల్-మే నుంచి ఇరు దేశాలు స్టాండ్ ఆఫ్ పాటిస్తున్నాయి. గల్వాన్ లోయలో జూన్‌లో చైనా దళాలు చేసిన దాడిలో 20 మంది భారత సైనికులు వీరమరణం పొందిన తర్వాత ఇరు దేశాల మధ్య పరిస్థితులు మరింత దిగజారాయి.
ఈ ఘటన అనంతరం ఇరు దేశాల మధ్య మూడు నెలల నుంచి చర్చలు జరుగుతున్నాయి. లెఫ్టినెంట్ జనరల్ స్థాయిలో కూడా ఐదు దశలాల్లో చర్చలు జరిగినప్పటికీ ఇప్పటి వరకు ఫలితాలు ఇవ్వలేదు.
ఇదీ చూడండి:సరిహద్దుల్లో తాజా వివాదం ఇక్కడే..