ఉత్తర్‌ప్రదేశ్ నోయిడాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నోయిడా పవర్ కంపెనీ లిమిటెడ్‌లోని(ఎన్‌పీసీఎల్) సెక్టార్ 148 సబ్‌స్టేషన్ వద్ద తీవ్రంగా మంటలు చెలరేగాయి. ఘటన స్థలానికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది...తీవ్రంగా శ్రమించి మంటలను అదుపు చేస్తున్నారు.
భారీ ఎత్తున అగ్ని జ్వాలలు ఎగసిపడటం వల్ల పరిసర ప్రాంతాల్లో పొగ అలుముకుంది. అయితే ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది.