అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళ స్వాగత వేడుకలో అపశ్రుతి జరిగింది. తమిళనాడు కృష్ణగిరి జిల్లాలోని పోచంపల్లి వద్ద శశికళకు స్వాగతం పలికేందుకు బాణసంచా కాల్చడం వల్ల ఓ మద్దతుదారుడి కారులో మంటలు చెలరేగాయి. దీంతో పక్కనే ఉన్న మరో కారుకు మంటలు వ్యాపించి.. రెండు కార్లూ దగ్ధమయ్యాయి. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు.
బెంగళూరు నుంచి చెన్నైకి వెళ్తున్న శశికళ.. దారిలో హోసూర్ ప్రాంతంలోని ముత్తుమారిమ్మన్ ఆలయంలో పూజలు చేశారు. శశికళ ప్రయాణిస్తోన్న కారుపై ఏడీఎంకే జెండా ఎగురుతూ ఉంది. ఇది గమనించిన పోలీసులు నోటీసులు జారీ చేశారు. కోర్టులో కేసు పెండింగ్ ఉన్నందు వల్ల కేవలం నోటీసులు జారీ చేసి.. జెండాను తొలగించలేదు.
ఇదీ చూడండి: చెన్నైకి చేరుకున్న శశికళ- 'ఏఎంఎంకే' ఘన స్వాగతం