దిల్లీ సీజీవో కాంప్లెక్స్‌లోని దీన్ దయాల్ అంత్యోదయ భవన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గాయపడ్డ సీఐఎస్ఎఫ్ ఎస్ఐ చికిత్స పొందుతూ మరణించాడు.
ఐదవ అంతస్తు నుంచి మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 25 ఫైర్ ఇంజన్లతో రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చింది.
మంటలార్పే ప్రయత్నంలో అలముకున్న పొగ కారణంగా సీఐఎస్ఎఫ్ ఎస్ఐ స్పృహతప్పి పడిపోయారు. చికిత్స నిమిత్తం ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
తాగునీరు-పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖ, అటవీ మంత్రిత్వ శాఖ , భారత వైమానిక దళ అధికారిక కార్యాలయాలు దీన్ దయాల్ భవనంలోనే ఉన్నాయి.