పశ్చిమ్ బంగా న్యూ టౌన్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. స్లమ్ ప్రాంతం నివేదితా పల్లీలో శనివారం రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాదాపు 30 గుడిసెలు దగ్ధమైనట్లు అధికారులు వెల్లడించారు. అయితే.. అగ్నిప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదు. స్థానికుల సమాచారం మేరకు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 30 నిమిషాల్లోనే మంటలను ఆర్పివేశారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
![30 houses gutted as fire breaks out in Kolkata's New Town](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9547327_2.jpg)
బాణసంచా కాల్చడం వల్లనే ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఇటీవల కాళీ పూజ, దీపావళి పండుగల నేపథ్యంలో.. బాణసంచా కాల్చడం, అమ్మకాలపై నిషేధం విధించింది కలకత్తా హైకోర్టు.
![30 houses gutted as fire breaks out in Kolkata's New Town](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9547327_1.jpg)