బంగాల్ రాజధాని కోల్కతాలో ఓ ఐదంతస్తుల నివాస భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది. శుక్రవారం రాత్రి జరిగిన ప్రమాదంలో 12 ఏళ్ల బాలుడు, ఓ వృద్ధురాలు మృతి చెందారు. ఇద్దరికి గాయాలయ్యాయి.
భయంతో భవనం నుంచి దూకి..
'మంటలను చూసి భయాందోళనకు గురైన 12 ఏళ్ల బాలుడు.. భవనం మూడో అంతస్తు నుంచి దూకాడు. దీనితో ఆ బాలుడుకి తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించిన కొద్ది సేపటికే అతడు ప్రాణాలు వదిలినట్లు' అధికారులు తెలిపారు. వృద్ధురాలి మృతదేహాన్ని భవనంలోని ఓ స్నానాల గదిలో గుర్తించినట్లు పేర్కొన్నారు. గాయాలైన వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.
భవనంలో ఉన్న మిగతా వారాందరిని సురక్షితంగా కాపాడినట్లు పోలీసులు తెలిపారు. అగ్ని మాపక సిబ్బంది ప్రస్తుతం మంటలను అదుపు చేశారని వివరించారు. మొదటి అంతస్తులో మొదలైన మంటలు.. ఇతర అంతస్తులకు వ్యాపించి ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు.
ఇదీ చూడండి:రోజంతా శవపేటికలో ఉన్న వ్యక్తి మృతి