ఉత్తర్ప్రదేశ్ నొయిడాలో రెండు వేర్వేరు వ్యాపార సంస్థల్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నగరంలోని ఫేజ్-3 ప్రాంతంలో తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఓ పరుపుల ఉత్పత్తి కంపెనీలోని నాలుగంతస్తుల భవనంలో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న మంటలను అదుపుచేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు.
నొయిడాలోని ఫేజ్-2 ప్రాంతంలో తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో షాట్ సర్క్యూట్ వల్ల మరో అగ్ని ప్రమాదం సంభవించింది. శానిటైజర్ తయారీ కంపెనీలో మంటలు చెలరేగాయి. తక్షణమే ఘటనా స్థలానికి చేరుకొన్న అగ్నిమాపక దళాలు.. మంటలను అదుపులోకి తెచ్చాయి.
ఇదీ చదవండి: ఉత్తర్ప్రదేశ్లో వరుణుడి బీభత్సం.. 43 మంది మృతి