ETV Bharat / bharat

ఆలస్య రుసుము నుంచి జీఎస్టీ చెల్లింపుదారులకు ఊరట - nirmala sitaraman

gst
జీఎస్టీ చెల్లింపుదారులకు శుభవార్త
author img

By

Published : Jun 12, 2020, 3:35 PM IST

Updated : Jun 12, 2020, 4:05 PM IST

15:56 June 12

ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ జీఎస్టీ చెల్లింపులపై కీలక నిర్ణయం తీసుకున్నారు. 2017 జులై నుంచి 2020 జనవరి మధ్య ఎలాంటి బకాయిలు లేకుండా జీఎస్టీ  రిటర్నులు దాఖలు చేసినవారిపై ఆలస్య రుసుము విధించబోమని చెప్పారు. జీఎస్టీ మండలి​ సభ్యులతో సమావేశమైన ఆర్థిక మంత్రి ఈ మేరకు జీఎస్టీ దాఖలుపై నిర్ణయాన్ని ప్రకటించారు. రాష్ట్రాలకు కరోనా నేపథ్యంలో చెల్లించాల్సిన పరిహారంపై జులైలో మరోసారి సమావేశమవుతామని చెప్పారు.

ఆలస్య రుసుములు ఇలా..

పన్ను బకాయిలు ఉన్నవారు, 2017 జులై-2020 జనవరి మధ్య జీఎస్టీ రిటర్నులు దాఖలు చేయని వారని నుంచి గరిష్ఠ ఆలస్య రుసుముగా రూ. 500 వసూలు చేయనున్నట్లు చెప్పారు నిర్మల. ఈ మొత్తం 2020 జులై 1 నుంచి 2020 సెప్టెంబర్ 30 మధ్య రిటర్నులు దాఖలు చేసే వారి నుంచి మాత్రమే వసూలు చేస్తామని వెల్లడించారు ఆర్థికమంత్రి.

రూ. 5 కోట్ల కంటే తక్కువ టర్నోవర్ ఉన్న చిన్న తరహా విక్రయదారులు ఫిబ్రవరి నుంచి ఆలస్యంగా దాఖలు చేస్తే పన్ను మొత్తంపై చెల్లించాల్సిన వడ్డీని 18 శాతం నుంచి 9 శాతానికి తగ్గించింది జీఎస్టీ కౌన్సిల్. 

పాన్ మసాలాపై వచ్చే భేటీలోనే..

పాన్​ మసాలాపై జీఎస్టీ విధింపుపై వచ్చే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలోనే నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు నిర్మల. పాదరక్షలు, ఎరువులపై జీఎస్టీ తగ్గింపునకు యోచిస్తున్నట్లు చెప్పారు నిర్మల.

15:31 June 12

ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ జీఎస్టీ వసూళ్లపై కీలక నిర్ణయం తీసుకున్నారు. 2017 జులై నుంచి 2020 జనవరి మధ్య జీఎస్టీ రిటర్నులు దాఖలు చేసినవారికి  ఆలస్యరుసుము విధించకూడదని ఆదేశాలు జారీ చేశారు.  

Last Updated : Jun 12, 2020, 4:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.