ETV Bharat / bharat

'నా గర్భ శోకానికి కారణం ఆ ఎమ్మెల్యేనే!' - అబార్షన్​ మున్సిపల్​ కమిషనర్

కర్ణాటక తెర్దాల్ భాజపా ఎమ్మెల్యే వర్గం తనపై జరిపిన దాడి వల్లే తనకు గర్భ శోకం మిగిలిందని మహాలింగపుర్ మున్సిపల్ కౌన్సిలర్​ చాందిని నాయక్​ ఆరోపించారు. నవంబరు 9న మున్సిపల్​ ఎన్నికలకు నామినేషన్​ దాఖలు చేయటానికి వెళ్లినప్పుడు గర్భవతి అని చూడకుండా తనపై ఎమ్మెల్యే వర్గం దాడి చేశారని మండిపడ్డారు.

Fight during municipal election: Abortion to a Municipal member
'నా గర్భ శోకానికి కారణం ఆ ఎమ్మెల్యేనే!'
author img

By

Published : Dec 1, 2020, 8:50 PM IST

తెర్దాల్ భాజపా ఎమ్మెల్యే సిద్ధు సవాడీ వర్గం చేసిన దాడి వల్లే తనకు అబార్షన్​ అయిందని కర్ణాటక మహాలింగపుర్ మున్సిపల్ కౌన్సిలర్​ చాందిని నాయక్​ ఆరోపించారు. మున్సిపల్​ ఎన్నికల్లో భాగంగా నవంబర్ 9న నామినేషన్​ దాఖలు చేయటానికి వెళ్లిన తనను ఎమ్మెల్యే సహా ఆయన అనుచరులు.. గర్భవతి అని చూడకుండా కిందకు నెట్టారని మండిపడ్డారు. ఈ ఘటనలో గర్భంలోని శిశువు మృతి చెందిందని, దీంతో వైద్యులు అబార్షన్​ చేయించుకోమన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆ వ్యాఖ్యలు అవాస్తవం

చాందిని నాయక్ వ్యాఖ్యలను ఖండించారు తెర్దాల్ భాజపా ఎమ్మెల్యే సిద్ధు సవాడీ. ఆమె గర్భవతి కాదని, ఆరు సంవత్సరాల క్రితమే ఆమెకు ట్యూబెక్టమీ ఆపరేషన్​ జరిగిందన్నారు. ఈ మధ్య కాలంలో అబార్షన్ కేసులు నమోదు కాలేదని జిల్లా వైద్యులు తెలిపారని సిద్ధు వివరించారు.

ఇదీ చదవండి : ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడికి సీబీఐ సమన్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.