రాజకీయాల్లో ఎదగాలనే కాంక్షతో ఓ తండ్రి మూడేళ్ల కూతుర్ని హత్య చేశాడు. ఈ ఘటన కర్నాటకలోని దేవణాగిరిలో జరిగింది.
గుట్టిదుర్గకి చెందిన నింగప్ప ఓ కాంట్రాక్టర్. ఈ ఏడాది జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇదే సమయంలో తనతో వివాహేతర సంబంధం పెట్టుకున్న శశికలతో నింగప్పకు వివాదం ఏర్పడింది. తాను నింగప్ప రెండో భార్యనని ప్రజలందరికీ బహిర్గతం చేయాలని శశికల వాదించడం వల్ల ఇరువురి మధ్య మనస్పర్థలు వచ్చాయి.
ఈ విషయంతో తన రాజకీయ జీవితంపై ప్రభావం పడుతుందని భావించిన నింగప్ప.. కూతుర్ని హత్య చేశాడు.
![Father_kills_daughter](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/kn-dvg-01-14-murder-twist-script-7203307_14102020124308_1410f_1602659588_414_1410newsroom_1602664938_132.png)
పోలీసుల విచారణలో..
తన కూతురు కనిపించడంలేదంటూ శశికల దేవణాగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై ముమ్మరంగా దర్యాప్తు చేసిన పోలీసులకు విస్తుపోయే నిజం తెలిసింది.
తన కూతురును హత్య చేసి వ్యవసాయ భూమిలో పాతిపెట్టినట్లు నింగప్ప ఒప్పుకున్నాడని విచారణ అనంతరం పోలీసులు తెలిపారు. శిరీష మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపినట్లు చెప్పారు.
ఇదీ చదవండి:క్షుద్రవిద్యల అనుమానంతో సజీవంగా పాతేశారు!