ETV Bharat / bharat

మానసిక రోగిపై తండ్రీకొడుకుల అత్యాచారం! - Trichy jail news

దేశంలో అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి. ఆడపిల్ల ఒంటరిగా కనిపిస్తే చాలు కాటేసే కామాంధులు ఎక్కువయ్యారు. తమిళనాడు అరియలూర్​ జిల్లాలో జరిగిన అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంటి సమీపంలో ఉండే మానసిక రుగ్మతతో బాధపడుతోన్న ఓ మహిళపై ఇద్దరు అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే ఈ ఇద్దరు తండ్రీకొడుకులు అవ్వడం గమనార్హం.

raping 32-year-old mentally challenged woman
మానసిక అనారోగ్యురాలిపై తండ్రీకొడుకల అత్యాచారం!
author img

By

Published : Jun 26, 2020, 12:32 PM IST

కామాంధుల చేతిలో చిన్న పిల్లలు, మానసిక రోగులు బలైపోతున్న ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అలాంటి అమానుష ఘటనే తమిళనాడు అరియలూర్​ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మానసిక రుగ్మతతో బాధపడుతోన్న ఓ మహిళపై తండ్రీకొడుకులు అత్యాచారానికి పాల్పడ్డారు.

అరియలూర్​ జిల్లా శ్రీపురాంథన్​ గ్రామానికి చెందిన కుమార్(45), అతని కొడుకు కాళిదాస్​ అలియాస్​ కార్తిక్​(22).. తమ ఇంటికి సమీపంలో ఉండే మానసిక రోగి అయిన మహిళ(32)పై వేరువేరు సందర్భాల్లో అత్యాచారం చేశారు. ప్రస్తుతం ఆ అభాగ్యురాలు 4 నెలల గర్భవతి. ఆమెకు తంజావూర్​లోని వైద్య కశాళాలలో చికిత్స అందుతోంది.

బాధితురాలి సోదరుడు.. మహిళా పోలీస్ స్టేషన్​లో తండ్రీకొడుకులపై ఫిర్యాదు చేసిన క్రమంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ నెల 12న ఇరువురిని అరెస్ట్​ చేసి త్రిచి జైలుకు తరలించారు పోలీసులు.

raping 32-year-old mentally challenged woman
నిందితులు

గూండా చట్టం కింద..

ఈ కేసును తీవ్రంగా పరిగణించిన త్రిచి డీఐజీ బాలక్రిష్ణన్​.. అరియాలూర్​ ఎస్పీ ఆర్.శ్రీనివాసన్​.. నిందితులను గూండా చట్టం కింద కేసు నమోదు చేయాలని జిల్లా పాలనాధికారికి సిఫార్సు చేశారు. ఈ మేరకు ఇరువురిపై గూండా చట్టం కింద కేసు నమోదు చేయాలని కలెక్టర్​ ఆదేశాలు జారీ చేశారు.

ఇదీ చూడండి: నిమ్మరసంలో మత్తుమందు కలిపి రోజూ అత్యాచారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.