జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా గృహనిర్బంధాన్ని అధికారులు ఎత్తివేశారు. జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఫరూక్ అబ్దుల్లాను ప్రజా భద్రతా చట్టం ప్రకారం గృహ నిర్బంధంలో ఉంచిన అధికారులు. దీనిని ఎత్తివేస్తూ కశ్మీర్ హోంశాఖ కార్యదర్శి షలీన్ కాబ్రా ప్రకటన విడుదల చేశారు.
మొదట 2019 సెప్టెంబర్ 19న అబ్దుల్లాపై ప్రజా భద్రతా చట్టాన్ని విధించిన అధికారులు... డిసెంబర్ 13న మరోసారి పొడిగించారు. ఫలితంగా ఏడు నెలల గృహ నిర్బంధం అనంతరం ఫరూక్ అబ్దుల్లా విడుదల కానున్నారు